Telangana : ఉచిత బస్సు సౌకర్యం.. 15 శాతం పెరిగిన రద్దీ..

తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం సౌకర్యం కల్పించడం వల్ల ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరుగుతోంది. గత ఆదివారం (డిసెంబర్‌ 3వ తేదీ)తో పోలిస్తే..ఈ ఆదివారం (డిసెంబర్ 10వ తేదీ)న దాదాపు 15 శాతం ప్రయాణికులు పెరిగారని.. ఇందులో ఎక్కువగా మహిళలే ఉన్నారని అధికారులు చెబుతున్నారు.

Telangana : ఉచిత బస్సు సౌకర్యం.. 15 శాతం పెరిగిన రద్దీ..
New Update

Mahalakshmi Scheme : తెలంగాణ(Telangana) లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. మహలక్ష్మీ పథకం(Mahalakshmi Scheme)లో భాగంగా మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సదుపాయం వల్ల ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరుగుతోంది. గత ఆదివారం (డిసెంబర్‌ 3వ తేదీ)తో పోలిస్తే.. ఈ ఆదివారం (డిసెంబర్ 10వ తేదీ)న దాదాపు 15 శాతం ప్రయాణికులు పెరిగారని.. ఇందులో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. జీరో టికెట్‌ సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి వచ్చాక.. ఎంతమంది వస్తున్నారనే స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. వాస్తవానికి మిగతా రోజుల కంటే సోమవారం ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ నెల 11న కార్తిక మాసంలో ఆఖరి సోమవారం కావడంతో మహిళా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండొచ్చని ఆర్టీసీ అంచనా వేస్తోంది. దీంతో డ్రైవర్లు, కండక్టర్లకు సెలవులను కూడా రద్దు చేసింది.

Also Read: ఆర్టికల్ 370పై నేడు సుప్రీం తీర్పు.. ప్రతి ఒక్కరూ తీర్పును గౌరవించాల్సిందేనన్న బీజేపీ..!!

ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో కాంగ్రెస్(Congress) ప్రభుత్వం మహిళలకు వయసుతో సంబంధం లేకుండా ఉచిత బస్ సౌకర్యం అమలు చేయడం వల్ల బస్టాండ్‌లు ప్రయాణికుల రద్దీ నెలకొంది. జిల్లాల్లో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్‌లు అలాగే నగరంలో ఆర్టీనరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలకు జీరో టికెట్‌ ఇస్తున్నారు. దీంతో ఈ బస్సుల్లో ప్రయాణించే మహిళ ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

Also Read: 54 మంది పోస్టులు ఊస్ట్.. రేవంత్ సంచలనం

#telugu-news #telangana-news #hyderabad #tsrtc #mahalakshmi-scheme #free-bus #bus-depot
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe