Rajinikanth: తాను పని చేసిన బస్సు డిపోకు వెళ్లిన తలైవా.... రజనీ సింప్లిసిటీని చూసి అభిమానులు ఫిదా...!
ఎంత ఎదిగినా అంత ఒదిగి వుండే వ్యక్తి సూపర్ స్టార్ రజనీ కాంత్. ఆసియాలోనే టాప్ హీరోల్లో ఒకరిగా వున్నా అత్యంత సాధారణ వ్యక్తిలా ఉండటం ఆయనకు మాత్రమే సాధ్యం. మనం ఏ స్థాయిలో వున్నా మన మూలాలను మరచి పోకూడదని నమ్మే వ్యక్తి ఆయన. అందుకే ఆయన సూపర్ స్టార్ స్థాయిలో వున్న తన పాత రోజులను మరచి పోలేదు. అందుకే కర్ణాకటలో తాను కండక్టర్ గా పని చేసిన బస్సు డిపోకు వెళ్లారు.