Hyderabad:మరీ ఇంత క్రూరమా? కోట్లకు కోట్లు కట్నం తీని కూడా హింస పెట్టి చంపేశారు!

నాలుగు కోట్లు కట్నం తీసుకున్నారు. బంగారం, ఇల్లు అన్నీ ఇచ్చారు..కానీ వాళ్ళకి ఇంకా ఆశ చావలేదు. మూడేళ్ళుగా అమ్మాయిని అదనపు కట్నం కోసం వేధించడంతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది.

New Update
Hyderabad:మరీ ఇంత క్రూరమా? కోట్లకు కోట్లు కట్నం తీని కూడా హింస పెట్టి చంపేశారు!

Woman Sucide Because Of Dowry Demand:భారతదేశం అభివృద్ధివైపు పరుగులు పెడుతోంది. ప్రపంచ దేశాలతో పోటీ పడుతోంది. పెద్ద చదువులు చదువుకుని దూసుకుని వెళుతున్నారు అమ్మాయిలు, అబ్బాయిలు...కానీ ఇంకా మన దేశంలో వరకట్నం వేధింపులు మాత్రం ఆగలేదు. ఈ వేధింపులతో చావులూ ఆగలేదు. కోట్లకు కోట్లు కట్నం ఇచ్చి బంగారం లాంటి అమ్మాయిలను తీసుకెళ్ళి నరరూప రాక్షసుల చేతుల్లో పెడుతున్న అమ్మాయిల తల్లిదండ్రులకూ బుద్ధి రావడం లేదు. ఎన్ని చావులను చూస్తున్నా మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తూ అమ్మాయిల జీవితాలను బలి పెడుతున్నారు.

4కోట్లు ఇచ్చి మరీ ఆత్మహత్య చేసుకున్న వివాహిత..

అమ్మాయి తల్లిదండ్రులకు బాగా డబ్బులున్నాయి. ఒక్కతే కూతురు..తమకున్నది అంతా ఇచ్చేసి మరీ పెళ్ళి చేశారు. కానీ అవతలి వాడు ఉత్త వెధవ. కోట్లకు కోట్లు కట్నం తీసుకుని కూడా వేధించాడు. ఆత్మహత్య చేసుకునే వరకూ హింసించాడు. హైదరాబాద్ సురారంలో జరిగిందీ సంఘటన. సూరారం నివాసి బట్ట అభిలాష్ తో అమరావతి వివాహం 2019 నవంబర్ 22న జరిగింది. అమరావతికి పుట్టింటివారు 550 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు కేజీల వెండి ఆభరణాలు, 10 లక్షల నగదు, పెళ్లి కానుకగా ఇచ్చారు. ఇది కాకుండా అమరావతికి హయత్ నగర్ లో మూడు కోట్ల విలువ చేసే పుట్టింటి వారిచ్చిన ప్లాట్ కూడా ఉంది.

మూడేళ్లుగా నరకం..
పెళ్ళయిన కొత్తలో అంతా బాగానే ఉంది. కానీ కొన్ని రోజులకే తమ అసలు రూపం చూపించడం మొదలుపెట్టారు భర్త అభిలాష్, అతని తల్లిదండ్రులు. అన్ని కోట్లు ఇచ్చినా ఇంకా దడ్డులు తెమ్మని అమరావతిని హింసించారు. మూడేళ్ళు నరకం చూపించారు. ఈ మద్యలో పిల్లలు పుట్టారు. అయినా కనికరించలేదు. చివరకు విసిగిపోయిన అమరావతి ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు తన చావుకు కారణం భర్త, అత్తమామలే అంటూ సూపైడ్నోట్ కూడా రాసింది. అందులో తన తల్లిదండ్రులు ఎంత కట్నం ఇచ్చిందీ...భర్త, అత్తమామలు తనను ఎలా హింసించారు అన్నదీ కూడా వివరంగా రాసింది అమరావతి.

చివరకు ఫ్యాన్‌కు ఉరేసుకుని..
భర్త అభిలాష్ వేధింపులు, అదనపు కట్నం డిమాండ్ తో ప్రతిరోజు ఆమె భర్తతో నరకం చూసింది. భర్త బాధలకు, అదనపు కట్నం వేధింపులకు విసిగిపోయిన అమరావతి సూరారంలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సూరారం పోలీసులు కేసు నమోదు చేసుకుని, శవాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మృతురాలు సోదరుడు దినేష్ తన సోదరి అమరావతి మృతికి కారకులైన భర్త అభిలాష్, అత్త అనురాధ, మామ శ్రీశైలంపై చర్యలు తీసుకోవాలని, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు