Incident In RTC bus:హయత్ నగర్ 1 డిపోకు చెందిన హయత్ నగర్ నుండి అఫ్టల్ గంజ్ రూట్ లో నడిచే 72 బస్ సర్వీస్ లో ఒక మహిళ మద్యం సేవించి బస్సులోకి ఎక్కింది. ఈ క్రమంలో చిల్లర విషయంలో విధులు నిర్వర్తిస్తున్న సదరు బస్ కండక్టర్ తో రాయలేని మాటల్లో బస్ కండక్టర్ ను నానా బూతులు తిడుతూ దుర్భాషలాడింది. అక్కడితో వదిలేయక కండక్టర్‌ను మహిళ చేత్తో కొడుతూ కాలుతో కూడా తన్నింది. బస్సులో ఉన్న తోటి ప్రయాణికులు ఎంత వారిం చినా సదరు మహిళ పట్టించుకోకుండా కండక్టర్ పై దాడికి పాల్పడింది.
Also Read:Railway jobs: రైల్వేలో 5,696 ఉద్యోగాలు..వెంటనే అప్లై చేసుకోండి.
ఈసంఘటన ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ...తెల్లవారుఝామున జరిగిందని మాత్రం తెలుస్తోంది. ఇంకా పూర్తిగా తెల్లవారలేదని తెలుస్తోంది. మహిళ ఎంత తిట్టినా బస్ కండక్టర్ మాత్రం సంయమనం పోగొట్టుకోలేదు. ఆమెకు నచ్చజెపుతూనే ఉన్నాడు. ఇంతలో మరో మహిళా ఉద్యోగి కూడా బస్ ఎక్కి గొడవ చేస్తున్న ఆమెకు నచ్చచెప్పాలని చూసింది. ఆమె చేస్తున్నది తప్పు అని చెప్పింది. కానీ సదరు మహిళ మాత్రం ఎవరు ఎంత చెప్పినా వినలేదు, పట్టించుకోలేదు. వెనక్కి లాగుతున్నా కండక్టర్‌ను కాలితో తన్నుతూనే ఉంది. చివరకు బస్సును ఒకచోట ఆపి ఆమెను బలవంతంగా బస్సులో నుంచి దింపించేశారు.
అయితే బస్సులో గొడవ చేసిన మహిళ ఎవరు, ఏమిటి అన్న వివరాలు మాత్రం తెలియలేదు. వీడియోలో కూడా మహిళ మొహం కనిపించడం లేదు. కానీ ఆమె తాగి బస్సు ఎక్కిందని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. సయ్యద్ కా బేటీ అంటోంది కానీ ఆ సయ్యద్ ఎవరో అన్నది కూడా తెలియడం లేదు. మహిళలకు ఫ్రీ బస్సు పథకం మొదలెట్టిన దగ్గర నుంచీ ఇలాంటి గొడవలు ఎక్కువ అయ్యాయని బస్సులో ఉన్న మిగతా వారు ఆరోపిస్తున్నారు. తమకు వచ్చిన ఫ్రీ బస్సు జర్నీని కొంత మంది మహిళలు ఇలాంటి చర్యలతో దుర్వినియోగం చేస్తున్నారని అంటున్నారు.