Volunteer System To Be Continue In AP : ఏపీ (Andhra Pradesh) లో వాలంటీర్ వ్యవస్థ పునరుద్ధరణ (Volunteer System) పై కూటమి ప్రభుత్వం (NDA Government) తర్జనభర్జన పడుతోంది. గతేడాది ఆగస్టులోనే వాలంటీర్ వ్యవస్థ రద్దయింది. అయితే వాలంటీర్ల మళ్లీ కొనసాగించే విధానంపై అప్పటి జగన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈ ఏడాది మే వరకు కూడా వాలంటీర్లు అక్రమంగానే పనిచేశారు. ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల్లో చూసుకుంటే 1,53,908 మంది వాలంటీర్లు ఉన్నారు. వీళ్లందరికీ నెలకు రూ.5 వేల చొప్పున 76.95 కోట్ల గౌరవ వేతనం అందిస్తున్నారు.
Also Read: మా కర్మకాలి అసెంబ్లీకి వచ్చాం.. కంటతడి పెట్టిన సబితారెడ్డి
ఎన్నికలకు ముందు వాలంటీర్ వ్యవస్థ అంశం కూడా చర్చనీయాంశమైంది. ముందుగా దీన్ని వ్యతిరేకించిన టీడీపీ-జనసేన-బీజేపీ (TDP-Janasena-BJP) ఆ తర్వాత తాము అధికారంలోకి వస్తే ఒక్కో వాలంటీర్‌కు రూ.10 వేలు ఇస్తామని హామీ ఇచ్చాయి. ఇప్పుడు వాలంటీర్లకు జీతం పెంచితే ఏటా ప్రభుత్వానికి రూ.1848 కోట్లు ఖర్చవుతుంది. ఈ ఏడాది మార్చి - మే మధ్య 1,09,192 వాలంటీర్లు రాజీనామా చేశారు. పరిమిత సంఖ్యతోనే వాలంటీర్ల వ్యవస్థ కొనసాగించాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. వచ్చే కేబినేట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనుంది. స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి కెపాసిటీ బిల్డింగ్ చేసి వీరి ద్వారానే మరిన్ని సేవలు అందించేలా ప్రణాళిక చేస్తోంది.
వాలంటీర్ల వివరాలు ఇలా
వాలంటీర్లల్లో పీజీ చేసిన వాళ్లు 5 శాతం.
డిగ్రీ చేసిన వాళ్లు 32 శాతం.
డిప్లోమా చేసిన వాళ్లు 2 శాతం.
ఇంటర్ చేసిన వాళ్లు 48 శాతం
10 తరగతి వాళ్లు 13 శాతం.
ఏజ్ గ్రూప్
20-25 - 25 శాతం
26-30 - 34 శాతం
31-35 - 28 శాతం