కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. తొలి 15 రోజుల్లోనే అవకతవకలు జరిగాయని.. ఉగ్రవాద దాడులు జరిగాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రస్తుతం ప్రధాని మోదీ.. ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలోనే నిమగ్నమయ్యారని ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. కేంద్రం రాజ్యాంగంపై దాడి చేస్తోందని.. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమన్నారు. ' రాజ్యాంగంపై దాడి చేయం ఆమోదయోగ్యం కాదు. ఏ శక్తి కూడా రాజ్యాంగాన్ని టచ్ చేయలేదు. మేము దాన్ని కాపాడుతాం. అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే రైలు ప్రమాదాలు. నీట్, యూజీసీ నెట్ పరీక్షల వివాదాలు, కశ్మీర్‌లో ఉగ్రదాడులు, గ్యాస్, టోల్ ధరలు పెగడం, నీటి సంక్షోభం లాంటివి చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు.
Also Read: కాంగ్రెస్‌లోకి సంజయ్ కుమార్.. అలిగిన జీవన్ రెడ్డి
దేశంలో ఇంత జరుగుతున్నా కూడా ప్రధాని మాత్రం తన ప్రభుత్వాన్ని కాపుడుకునే పనిలో బిజీ అయిపోయారంటూ విమర్శించారు. ఇప్పుడున్న బలమైన ప్రతిపక్షం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ప్రజల తరఫున తమ గొంతు వినిపిస్తూనే జవాబుదాతీతనం లేకుండా ప్రధాని తప్పించుకోవాడాన్ని అడ్డుకుంటామన్నారు.
Also Read: కేరళ కాదు కేరళం.. అసెంబ్లీలో తీర్మానం ఆమోదం