Telangana: కాంగ్రెస్‌లోకి సంజయ్ కుమార్.. అలిగిన జీవన్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్.. కాంగ్రెస్‌లో చేరడంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారు. తనకు సమాచారం ఇవ్వకుండానే సంజయ్‌ను చేర్చుకోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో జీవన్ రెడ్డి.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. By B Aravind 24 Jun 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Jeevan Reddy: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి (Congress) నేతల వలసలు మళ్లీ మొదలయ్యాయి. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar).. కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. అయితే సంజయ్ చేరికతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారు. తనకు సమాచారం ఇవ్వకుండానే సంజయ్‌ను చేర్చుకోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో జీవన్ రెడ్డి.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన అనుచరులతో కలిసి భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. Also Read: కేరళ కాదు కేరళం.. అసెంబ్లీలో తీర్మానం ఆమోదం అయితే జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్‌లు వెళ్లారు. ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. అయితే 40 ఏళ్లుగా గౌరవప్రదమైన రాజకీయాలు చేశానంటూ పార్టీ నేతలో జీవన్ రెడ్డి అన్నారు. పార్టీకి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానని చెప్పినట్లు సమాచారం. వ్యక్తిగా గౌరవం లేనప్పుడు ప్రజా జీవితం ఎందుకని.. నాకు గౌరవం లేనప్పుడు ఈ పదవి ఎందుకని ఆయన అన్నట్లు తెలుస్తోంది. #jeevan-reddy #telugu-news #congress #brs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి