CRIME:భర్తను పాముతో కాటువేయించి చంపిన భార్య

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా తన భర్తను తానే చంపించి తర్వాత గుండెపోటని చిత్రీకరించడానికి ప్రయత్నించిందో మహిళ. డబ్బులిచ్చి, పాముతె కాటు వేయించి మరీ భర్తను చంపించింది.

CRIME:భర్తను పాముతో కాటువేయించి చంపిన భార్య
New Update

రాను రాను మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. సుఖాల మోజులో పడి కట్టుకున్న వారిని పట్టించుకోవడం లేదు. దాంతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. అక్కడ మార్కేండయ కాలనీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రవీణ్ ను భార్యే డబ్బులిచ్చి మరీ చంపించింది. ముందు దిండుతో ఊపిరాడకుండా చేసి తర్వాత పాముతో కాటు వేయించి మరీ చంపింది. ఆ తర్వాత గుండె పోటని నమ్మించడానికి ప్రయత్నించింది. కానీ మృతుడి తల్లికి అనుమానం వచ్చి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.

కొచ్చెర ప్రవీణ్‌ మార్కండేయ కాలనీకి చెందిన రియల్‌ ఎస్టేట్ వ్యాపారి. కొన్నాళ్లుగా ప్రవీణ్‌ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వివాహేతర బంధంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవ పడుతూ ఉండేవారు. చివరకు విసిగిపోయిన భార్య లలిత భర్త ప్రవీణ్‌ను చంపాలని డిసైడ్ అయింది. భర్త దగ్గర పనిచేసే హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన..మచ్చ సురేష్‌తో కలిసి హత్యకు ప్లాన్ చేసింది.భర్తను చంపితే ఒక ప్లాట్‌ ఇస్తానని ఆఫర్ ఇచ్చింది. దీంతో ప్రవీణ్‌ను చంపేందుకు
స్నేహితులతో కలిసి సురేష్‌ స్కెచ్ వేశాడు. రామగుండానికి చెందిన ఇందారపు సతీష్‌, మందమర్రికి చెందిన మాస శ్రీనివాస్‌, భీమ గణేశ్‌, చంద్రశేఖర్‌లు కలిసి ప్రవీణ్ను హత్య చేశారు.

Also Read:భారత్-పాక్ మ్యాచ్ కోసం సిద్ధమవుతున్న హైదరాబాద్

ఈనెల 9న రాత్రి రామగుండంలో మద్యం తాగిన నిందితులు తర్వాత ప్రవీణ్ ఇంటికి చేరుకున్నారు. ప్రవీణ్‌ ముఖంపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి దాని తర్వాత పాముతో కాటు వేయించి అక్కడి నుంచి పరారయ్యారు. భర్త చనిపోయాడని నిర్ధారించుకున్న లలిత గుండెపోటుతో చనిపోయాడంటూ డ్రామా ఆడింది. కానీ అనుమానం వచ్చి ప్రవీణ్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. మిస్టరీని ఛేదించిన పోలీసులు లలిత, సురేష్ తో పాటూ నిందితులందరినీ పట్టుకున్నారు. ప్రవీణ్‌, లలిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

#murder #telangana #killed #wife #husband #peddapalli
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe