Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ అందుకే ప్రకటించలేదు: ఈసీ

జమ్మూకశ్మీర్‌లో భద్రతా అవసరాల దృష్ట్యా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వాయిదా వేశామని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. అలాగే అక్కడ వర్షాలు కురుస్తుండటంతో ఓటరు జాబితాను అప్‌డేట్ చేయడంలో ఆలస్యం జరిగిందని స్పష్టం చేశారు.

New Update
Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ అందుకే ప్రకటించలేదు: ఈసీ

జమ్మూకశ్మీర్‌, హర్యానా రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు రాష్ట్రాలతో సహా జార్ఖండ్, మహారాష్ట్రకు కూడా ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల తేదీపై ఈసీ ప్రకటన చేయలేదు. అయితే దీనికి గల కారణాలను సీఈసీ రాజీవ్‌ కుమార్ వివరించారు. జమ్మూకశ్మీర్‌లో భద్రతా అవసరాల దృష్ట్యా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వాయిదా వేశామని తెలిపారు.

Also Read: శాస్త్రవేత్త డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్ ఎలా అగ్ని క్షిపణి పితామహుడు అయ్యారు?

అలాగే మహారాష్ట్రలో వర్షాలు కురుస్తుండటంతో ఓటరు జాబితాను అప్‌డేట్ చేయడంలో ఆలస్యమైందని పేర్కొన్నారు. అక్కడ పితృవృక్షం, వినాయక చవితి, దీపావళి పండుగలు, పలు కార్యక్రమాలు జరగాల్సి ఉందని తెలిపారు. ఇలా వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే మహారాష్ట్ర ఎన్నికలు వాయిదా వేశామని స్పష్టం చేశారు. ఈసారి వరుసగా అయిదు రాష్ట్రాలకు (జమ్మూ కశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్‌, ఢిల్లీ) ఎన్నికలు జరగాల్సి ఉందని చెప్పారు. కానీ ఎన్నికల సిబ్బంది అవసరాన్ని బట్టి రెండు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

Also Read: ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటన.. చివరిసారి ఆమె డైరీలో రాసుకుంది ఇదే

Advertisment
తాజా కథనాలు