Microsoft Outage: మైక్రోసాఫ్ట్‌ క్రాష్‌తో కుదేలైన ప్రపంచం.. కానీ చైనాలో మాత్రం

మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో టెక్నికల్ సమస్య తలెత్తగా అనేక దేశాలు కుదేలయ్యాయి. కానీ చైనాలో మాత్రం ఈ ప్రభావం అంతగా కనిపించలేదు. ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలు 'క్రౌడ్‌స్ట్రైక్‌' అనే సైబర్‌సెక్యూరిటీ టెక్నాలజీని వాడుతున్నాయి. కానీ చైనాలో మాత్రం అంతగా వాడకపోవడం వల్లే ఈ సమస్య రాలేదు,

Microsoft Outage: మైక్రోసాఫ్ట్‌ క్రాష్‌తో కుదేలైన ప్రపంచం.. కానీ చైనాలో మాత్రం
New Update

Microsoft CrowdStrike Outage: రెండు రోజుల క్రితం ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో టెక్నికల్ సమస్యలు తలెత్తడం సంచలనమ రేపిన సంగతి తెలిసింది. దీనివల్ల చాలా దేశాల్లో విమాన సేవలు,బ్యాంకులు, స్టాక్‌ మార్కెట్లతో సహా వివిధ కార్యకలాపాలు ఎక్కడిక్కడే ఆగిపోయాయి. కంప్యూటర్‌లు, ల్యాప్‌టాప్‌లలో బ్లూ స్క్రీన్‌ ఆఫ్‌ డెత్ ఎర్రర్ (Blue Screen Error) కనిపించడంతో సిస్టమ్‌లు షట్‌డౌన్‌/ రిస్టార్ట్‌ అయ్యాయి. అయితే భారత్‌ పొరుగుదేశమైన చైనాలో మత్రం మైక్రోసాఫ్ట్‌ ప్రభావం అంతగా కనిపించలేదు. అక్కడ విమాన సర్వీసులు, బ్యాంకులు ఎప్పటిలాగే కొనసాగాయి. ఇది చైనాకు ఎలా సాధ్యమైందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Also read: జగన్‌కు ఏం చెప్పానంటే?.. RTVతో RRR ఎక్స్‌క్లూజివ్!

క్రౌడ్‌ స్ట్రైక్‌ను అప్‌డేట్ చేయకపోవడం వల్లే టెక్నికల్ సమస్య వచ్చందని మైక్రోసాఫ్ట్‌ కంపెనీ ప్రకటించింది. అయితే క్రౌడ్‌ స్ట్రైక్ అనేది అమెరికాకు ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ (Cyber Security). విండోస్‌ సహా ప్రముఖ ఐటీ సంస్థలకు అడ్వాన్స్‌డు సెక్యూరిటీని అందిస్తుంది. చైనాలో (China) మాత్రం చాలా తక్కువ కంపెనీలు ఈ క్రౌడ్ స్ట్రైక్‌ను వాడుతున్నాయి. చైనాలో ఉంటూ పనిచేస్తున్న అమెరికా సంస్థలు మాత్రమే ఈ క్రౌడ్‌స్ట్రైక్‌ ను వినియోగిస్తున్నాయి. అందుకే చైనాపై పెద్దగా ప్రభావం చూపించలేదు. అలాగే.. అక్కడ మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్ సర్వీసులను స్థానిక భాగస్వామి అయిన 21 వయానెట్‌ నిర్వహిస్తోంది.

చైనా రూల్స్ ప్రకారం.. గ్లోబల్ క్లౌడ్ సర్వీసులను అక్కడి స్థానిక సంస్థలై నిర్వహించాలి. అందుకోసమే మైక్రోసాఫ్ట్ సంస్థ తమ క్లౌడ్ సేవలను 21 వయోనెట్‌కు బాధ్య అప్పగించింది. ఇలా ఉండటం వల్లే మైక్రోసాఫ్డ్‌ క్రాష్ అయిన సమయంలో చైనా పరిస్థితులు మిగతా దేశాలతో పోలిస్తే అంత ప్రభావం కనిపించలేదు. మరో విషయం ఏంటంటే ఇతర దేశాల్లో సైబర్ ముప్పుగానీ, ఇతర సాంకేతిక సమస్యలు వస్తే.. వాటి ప్రభావం తమ దేశంపై పడకుండా ఉండాలని చైనా సొంతంగానే పటిష్ఠ సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడం విశేషం.

Also Read: బైడెన్‌ కన్నా హారిస్‌ను ఓడించడం చాలా తేలిక: ట్రంప్

వింజోస్‌లో తలెత్తిన ఈ క్రౌడ్‌ స్ట్రైక్ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉన్న 85 లక్షల కంప్యూటర్లపై పడినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. అయితే ఈ సమస్య వల్ల విమాన, బ్యాంకింగ్‌, స్టాక్‌ మార్కెట్‌ సర్వీసులతో పాటు వివిధ కార్యకలపాలపై ప్రభావం చూపించినప్పటికీ పర్సనల్‌ కంప్యూటర్లలో మాత్రం ఇది కనిపించలేదు. దీనిపై స్పందించిన సాంకేతిక నిపుణులు.. క్రౌడ్‌ స్ట్రైక్‌ సెక్యూరిటీని ప్రముఖ ఐటీ సంస్థలు, అలాగే సైబర్ దాడుల నుంచి ముప్పు ఉండే కీలక సంస్థలే వినియోగిస్తాయని తెలిపారు. అందుకే వీటిపై ఎక్కువగా ప్రభావం పడినట్లు తెలిపారు. పర్సనల్ కంప్యూటర్‌లలో క్రౌడ్‌స్ట్రైక్ వినియోగించేవాళ్లు చాలా తక్కువగా ఉంటారు. అందుకే పీసీలలో ఈ సమస్య కనిపించలేదని స్పష్టం చేశారు.

#microsoft-windows #telugu-news #china #microsoft-outage
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe