Telangana: పీసీసీ అధ్యక్ష పదవిపై ఉత్కంఠ.. ఆయన వైపే చూస్తున్న అధిష్ఠానం

తెలంగాణ పీసీసీ ఎవరూ అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. రేసులో బీసీల నుంచి మధుయాష్కీ గౌడ్, మహేష్‌ కుమార్ గౌడ్, సురేష్ షెట్కర్, ఎస్టీల నుంచి బలరాం నాయక్, సంపత్‌ కుమార్‌ ఉన్నారు .మధుయాస్కీ విషయంలో అధిష్ఠానం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.

Telangana: పీసీసీ అధ్యక్ష పదవిపై ఉత్కంఠ.. ఆయన వైపే చూస్తున్న అధిష్ఠానం
New Update

Telangana PCC Chief: తెలంగాణ పీసీసీ ఎవరూ అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ (CM Revanth Reddy) మంతనాలు జరుపుతున్నారు. నిన్న రాత్రివరకు కేసీ వేణుగోపాల్ (K.C.Venugopal) ఇంట్లోనే సీఎం రేవంత్ ఉన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, శ్రీధర్ బాబులు ఉన్నారు. అయితే ఈరోజు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు (Mallikarjun Kharge) కేసీ వేణుగోపాల్ నివేదిక ఇవ్వనున్నారు. ఈ నివేదిక ఆధారంగానే పీసీసీ అధ్యక్షుడుని ఖర్గే ఫైనల్ చేయనున్నారు.

Also read: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్… కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే

రెండు, మూడు రోజుల్లో లేదా.. జులై మొదటివారంలో పీసీసీ అధ్యక్షుడిని నియమించే అవకాశాలు ఉన్నాయి. పీసీసీ రేసులో బీసీల నుంచి మధుయాష్కీ గౌడ్ (Madhu Yaskhi Goud), మహేష్‌ కుమార్ గౌడ్, సురేష్ షెట్కర్ ఉన్నారు. ఇక ఎస్టీల నుంచి బలరాం నాయక్, సంపత్‌ కుమార్‌ ఉన్నారు. భట్టి విక్రమార్క, సీతక్క కూడా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మధుయాస్కీ విషయంలో అధిష్ఠానం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.

Also Read: దయచేసి ఉండండి సారూ.. ఉపాధ్యాయుడి కాళ్ళపై పడి ఏడ్చేసిన విద్యార్థులు.!

#congress #cm-revanth-reddy #mallikarjun-kharge #madhu-yaskhi-goud
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe