Who Is IPL Speed Sensation Mayank Yadav? : ఐపీఎల్(IPL) ప్రతీ ఏడాది కత్తిలాంటి కుర్రాళ్లను వెలుగులోకి తీసుకొస్తుంటుంది. అప్పటివరకు దేశవాళి మ్యాచ్‌లో అదరగొట్టినా రాని ఫేమ్ ఐపీఎల్ ద్వారా యువ క్రికెటర్లకు దక్కుతుంది. ఇక ఆ తర్వాత టాలెంట్‌ని గ్రూమ్ చేసుకుంటూ వడివడిగా టీమిండియా(Team India) లోకి ఎంట్రీ ఇచ్చేస్తారు ఈ యంగ్ గన్లు. ఈ ఏడాది కూడా మరో చాకు లాంటి కుర్రాడు ఫ్యాన్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నాడు. అయితే గతానికి భిన్నంగా ఈ సారి ఓ బౌలర్ ఫ్యాన్స్ మనసు దోచుకుంటున్నాడు. గతంలో ఇలా ఓ బౌలర్ ఫ్యాన్‌ను కట్టిపడేయడం బుమ్రా డెబ్యూ టైమ్‌లో జరిగింది. మధ్యలో ఉమ్రాన్ మాలిక్ లాంటి వారు అప్పుడప్పుడు మెరుపులు మెరిపించినా వారి కెరీర్ మాత్రం పెద్దగా టర్న్ తీసుకోలేదు. ఇక తాజాగా పంజాబ్ వర్సెస్ లక్నో(Punjab v/s Lucknow) మ్యాచ్‌లో 21 ఏళ్ల మయాంక్ యాదవ్(Mayank Yadav) బంతితో నిప్పులు చెరగడం అందరి దృష్టిని ఆకర్షించింది.
తొలి బంతి నుంచే మొదలు:
లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎల్‌ఎస్‌జీ 199 పరుగులు చేసింది. ఈ స్కోరును ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టుకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభానిచ్చారు. ఒక సమయంలో 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 88 పరుగులు చేసింది పంజాబ్. ఆ సమయంలో PBKS లక్ష్యాన్ని సులువుగా ఛేదించగలదని అనిపించింది. అయితే 21 ఏళ్ల మయాంక్ యాదవ్ ఎంట్రీత సీన్ మారిపోయింది. ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఈ యువ ఫాస్ట్ బౌలర్ తొలి ఓవర్‌లోనే తన స్పీడ్‌తో సంచలనం సృష్టించాడు. తన ఐపీఎల్ కెరీర్‌లో మొదటి బంతిని 147.1kph వేగంతో బౌల్ చేశాడు. మూడో బంతికి అతను 150kph మార్కును కూడా చేరుకున్నాడు.
నయా రికార్డు:
మయాంక్ యాదవ్ 12వ ఓవర్లో తన పేస్‌తో మళ్లీ విధ్వంసం సృష్టించాడు.155.8 వేగంతో బౌల్ చేశాడు. ఐపీఎల్ 2024లో ఇదే అత్యంత వేగవంతమైన బంతి. ఈ ఓవర్‌లో మయాంక్ 150కిలోమీటర్ల మార్కును మొత్తం మూడుసార్లు అధిగమించడం విశేషం. పంజాబ్ కింగ్స్‌పై మయాంక్ యాదవ్ తన కోటాలో 4 ఓవర్లు వేసి మొత్తం 27 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. లక్నో గెలుపులో మయాంక్‌దే కీలక పాత్ర.
ఎవరీ మయాంక?
21 ఏళ్ల మయాంక్ యాదవ్ ఢిల్లీ(Delhi) తరపున దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. దేశవాళీ సర్క్యూట్‌లోనూ ఈ యువ బౌలర్ తన పేస్‌తో విధ్వంసం సృష్టించాడు. మయాంక్ ఇప్పటివరకు 10 టీ20, 17 లిస్ట్-A మ్యాచ్‌లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో మొత్తం 46 వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్-2022 వేలంలో మయాంక్ యాదవ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ బేస్ ధర రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2023లో గాయం కారణంగా అతను టోర్నీకి దూరమయ్యాడు. వార్మప్ మ్యాచ్‌లో గాయపడ్డాడు. ఇక ఈ ఏడాది పంజాబ్‌పై మ్యాచ్‌లో అరంగేట్రం చేసే అవకాశం రావడంతో తన ఫేస్‌తో నిప్పులు చెరిగాడు.
Also Read : మీ లవర్‌తో ఎంజాయ్ చేసేందుకు హైదరాబాద్‌లోని రొమాంటిక్ స్పాట్స్ ఇవే!