Hyderabad Love places: రొమాన్స్(romance) అంటే అందరికి ఇష్టం ఉంటుంది. వీకెండ్(weekend) లేదా పండుగ సెలవుల్లో లవర్‌తో కలిసి ఎక్కడికైనా వెళ్లాలనిపిస్తుంది. అందులో హైదరాబాద్‌లో లవ్ బర్డ్స్ ఎక్కువ ఉంటారు. మీ లవర్ కోసం రొమాంటిక్ డేట్ ప్లాన్ చేయడానికి హైదరాబాద్‌లో చాలా ప్రదేశాలున్నాయి. విలాసవంతమైన హోటళ్లుగా మారిన చారిత్రక ప్రదేశాల నుంచి మిమ్మల్ని వేరే ప్రపంచానికి తీసుకెళ్లే ప్రత్యేక రెస్టారెంట్ల వరకు పిచ్చిగా ప్రేమలో ఉన్న జంటకు ఈ నగరం చెప్పలేనంత థ్రిల్ ఇస్తుంది. మీరు లాంగ్ వీకెండ్ హాలిడే లేదా డిన్నర్ డేట్ కు వెళ్లాలనుకుంటే ఈ విషయాలను తెలుసుకోండి.

రామోజీ ఫిల్మ్ సిటీ:
మీ లవ్ లేదా లైఫ్ పార్టెనర్ సినిమా అభిమాని అయితే రామోజీ ఫిల్మ్ సిటీ టూర్ వెయ్యండి. ఇక్కడ బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో జరిగే బ్యాక్ స్టేజ్ వర్క్‌ను వీక్షించవచ్చు. విశాలమైన క్యాంపస్‌లో ఉన్న హోటళ్లను బుక్ చేసుకుని మీ అభిమాన తారలు నటించిన బిగ్గెస్ట్ సినిమా హిట్స్‌లో నటించిన లగ్జరీ వైభవాన్ని ఆస్వాదించవచ్చు. అంతే కాదు.. ఈ థీమ్ పార్క్ సాహస క్రీడలు (బంగీ ఎజెక్షన్, స్వింగ్ అండ్ క్లైంబింగ్ లూప్, ఫుట్బాల్, క్రికెట్), స్టూడియో పర్యటనలు (అస్కారీ గార్డెన్, మొఘల్ గార్డెన్, జపనీస్ గార్డెన్, ఏంజెల్స్ ఫౌంటెన్ గార్డెన్, సన్ ఫౌంటెన్ గార్డెన్, సాంక్చురీ గార్డెన్), మూవీ మ్యాజిక్ పార్క్ (ఫిల్మీ దునియా, అద్భుతమైన శబ్ద ప్రభావాలు, ఫ్రీ ఫాల్ యొక్క అనుకరణ అనుభవం) లాంటి అనేక ఆసక్తికరమైన కార్యకలాపాలను అందిస్తుంది.

మీ ప్రియమైన వ్యక్తితో కలిసి లాంగ్ డ్రైవ్‌కు వెళ్లాలనుకున్నప్పుడు హైదరాబాద్‌లో మార్నింగ్ టైమ్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అయితే.. నెక్లెస్ రోడ్ చుట్టూ అర్థరాత్రి ప్రయాణం చాలా బాగుంటుంది. ది వాటర్ ఫ్రంట్, ఓహ్రీస్ తాన్ సేన్ అండ్ బిద్రి లాంటి కొన్ని గొప్ప రెస్టారెంట్లు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ గార్డెన్స్, లుంబినీ పార్కు నుంచి సికింద్రాబాద్ లోని సంజీవయ్య పార్కు వరకు నెక్లెస్ రోడ్డు పక్కన ఉన్న పార్కుల్లో పచ్చదనం మధ్య ప్రశాంతంగా గడపవచ్చు.

దుర్గం చెరువు: మీ లవర్‌ని ‘సీక్రెట్ లేక్’కు తీసుకెళ్లండి. ఇక్కడ అందుబాటులో ఉన్న మెకనైజ్డ్ బోట్, వాటర్ స్కూటర్ అండ్ పెడల్ బోట్‌ను సరదాగా నడపవచ్చు. లేదా నీటి వెంట రొమాంటిక్ వాక్‌కు వెళ్ళవచ్చు. ఈ సుందరమైన సరస్సు అస్తవ్యస్తమైన వేగవంతమైన నగర జీవితం నుంచి శాంతియుత విరామాన్ని అందిస్తుంది.

ఓహ్రి గుఫా: మీ రొమాంటిక్ డేట్ పర్ఫెక్ట్‌గా ఉండటానికి డిమ్ లైట్స్‌తో పర్ఫెక్ట్ రెస్టారెంట్ ఇది. అద్భుతమైన ఇంటీరియర్లతో, ఓహ్రి గుఫా ప్రత్యేకమైన రెస్టారెంట్. వెయిటర్లు వేటగాళ్ల వేషధారణలో ఉంటారు. అద్భుతమైన మెనూ ఉంటుంది. హైదరాబాద్‌లో డేటింగ్ కు అనువైన ప్రదేశాల్లో ఇదొకటి.
ALSO READ: రిలేషన్షిప్ ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఈ తప్పులు చేయకండి!