Mohammad Siraj: అప్పుడు తిట్టినవారే ఇప్పుడు పొగుడుతున్నారు

మహ్మద్‌ సిరాజ్‌ గతంలో బీసీసీఐ ప్రకటించిన టీమ్‌లో ఇతని పేరు ఉంటేనే క్రికెట్‌ అభిమానులు చీదరించుకువారు. సిరాజ్‌ బౌలింగ్‌లో ప్రత్యర్థి టీమ్‌లకు చెందిన బ్యాటర్లు దొరికించే ఛాన్స్‌లా చెలరేగి పోయేవారు. అలా ప్రారంభమైంది మహ్మద్‌ సిరాజ్‌ జర్నీ.

Mohammad Siraj: అప్పుడు తిట్టినవారే ఇప్పుడు పొగుడుతున్నారు
New Update

మహ్మద్‌ సిరాజ్‌ గతంలో బీసీసీఐ ప్రకటించిన టీమ్‌లో ఇతని పేరు ఉంటేనే క్రికెట్‌ అభిమానులు చీదరించుకువారు. సిరాజ్‌ బౌలింగ్‌లో ప్రత్యర్థి టీమ్‌లకు చెందిన బ్యాటర్లు దొరికించే ఛాన్స్‌లా చెలరేగి పోయేవారు. అలా ప్రారంభమైంది మహ్మద్‌ సిరాజ్‌ జర్నీ. గతంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా పర్యటనలో సిరాజ్‌ వికెట్లు తీయకపోగా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో సిరాజ్‌ జట్టులో అవసరమా..? అతడు కాకుండా భారత్‌లో బౌలర్లే లేరా అని నెటిజన్లు బీసీసీఐపై ఆరోపణలు చేశారు.

దీంతో బీసీసీఐ శ్రీలంక టూర్‌కు వెళ్లిన భారత జట్టులో సిరాజ్‌ లేకుండా అతన్ని పక్కన పెట్టింది బీసీసీఐ. అనంతరం ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్‌-గవాస్కర్‌ టోర్నీలో మహ్మద్‌ షమీ గాయం కారణంటో ఆ టూర్‌కు వెళ్లకపోవడం వల్ల సిరాజ్‌కు మళ్లీ అనుకోకుండా అవకాశం వచ్చింది. అప్పుడే సిరాజ్‌లో ఉన్న ప్రతిభ బయట పడింది. బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లో భాగంగా జరిగిన మొదటి టెస్ట్‌లో సిరాజ్‌ తనపై చేసిన విమర్శలకు బాల్‌తో చెక్‌ పెట్టాడు. ఈ మ్యాచ్‌ సిరాజ్‌ 4 కీలక వికెట్ల పడగొట్టాడు. అనంతరం జరిగిన రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో సైతం సిరాజ్ కీలక వికెట్లను పడగొట్టాడు. ఇదే సమయంలో మహ్మద్‌ సిరాజ్ తండ్రి మృతి చెందాడు.

దీంతో అతను స్వదేశానికి తిరిగి రావాల్సి ఉంది. కానీ తన తండ్రి తనను గొప్ప క్రికెటర్‌గా చూడాలని ఆశపడ్డాడని, తనకు ప్రస్తుతం మంచి అవకాశం వచ్చిందని, తన తండ్రి ఆశను నెవేర్చుతానని భావించిన హైదరాబాదీ పేసర్‌.. ఇండియాకు తిరిగి రాకుండా బోర్డర్‌-గవాస్కర్‌ టోర్నీలో పాల్గొన్నాడు. మరోవైపు అదే సమయంలో సిరాజ్‌కు తోటి ప్లేయర్లు అండగా నిల్చారు. బీసీసీఐ సైతం అతనికి అండగా నిలిచింది. కాగా సిరాజ్‌ అప్పటి నుంచి ఇప్పటి వరకు తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని సధ్వినియోగం చేసుకుంటూ తాను టీమ్‌లో ప్రధాన పేసర్‌గా పేరుతెచ్చుకున్నాడు.

మంచి మనస్సు చాటుకున్న సిరాజ్‌

మహ్మద్‌ సిరాజ్‌ మంచి మనస్సు చాటుకున్నాడు. ఆసియా కప్‌ ఫైనల్‌లో తనకు వచ్చిన మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్‌ డబ్బులను గ్రౌండ్‌ సిబ్బందికి ఇస్తున్నట్లు ప్రకటించాడు. గ్రౌండ్‌ సిబ్బంది ఆసియా కప్‌ టోర్నీ సక్సెస్‌ ఫుల్‌గా ముగించడానికి గ్రౌండ్‌ సిబ్బంది శ్రమ అధికంగా ఉందని తెలిపాడు. వారు సకాలంలో స్పందించకపోతే ఆసియా కప్‌ టోర్నీలోని భాగంగా జరిగిన మ్యాచ్‌లు విజయవంతంగా జరిగేవి కాదని, వారి కష్టానికి తన వంతుగా తనకు వచ్చిన ప్రైజ్‌ మనీని ఇస్తున్నట్లు ప్రకటించాడు. సిరాజ్‌ నిర్ణయంతో స్టేడియంలో ఉన్న ప్రముఖులు అతన్ని పొగడ్తలతో ముంచెత్తారు.

#sri-lanka #australia #asia-cup #south-africa #new-zealand #mohammad-siraj #detractors #praise
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe