China new virus:నిమోనియా మీద వెంటనే రిపోర్ట్ ఇవ్వాలని చైనాకు డబ్ల్యూహెచ్వో ఆదేశం

చైనాలో కలవరపెడుతున్న నిమోనియా మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. దీని మీద వెంటనే పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని ఆ దేశాన్ని ఆదేశించింది.

China new virus:నిమోనియా మీద వెంటనే రిపోర్ట్ ఇవ్వాలని చైనాకు డబ్ల్యూహెచ్వో ఆదేశం
New Update

కరోనా పుట్టిందే చైనాలో. ఆ వ్యాధి ఎక్కువ రోజులు ఉన్నది కూడా అక్కడే. ప్రపంచం అంతా కరోనా బారిన పడ్డా...ఎక్కువ ఏళ్ళు బాధపడింది చైనా ఒక్కటే. మొన్న మొన్నటి వరకూ లాక్ డౌన్ ఆంక్షలతో ఉన్న చైనా ఇప్పుడు మళ్ళీ అదే దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం అంతుచిక్కని నిమోనియా చైనీయులను భయపెడుతోంది. ఈ రెస్పిరేటరీ నిమోనియాతో అక్కడ వందల మంది పిల్లు ఆస్పత్రుల పాలవుతున్నారు. దీనికి కారణం తెలియడం లేదు సరికదా అత్యంత వేగంగా కూడా వ్యాపిస్తోంది. అందుకే ఈ నియోనియా మీద డబ్ల్యూహెచ్వో ఆందోళన ప్రకటించింది. వెంటనే ఫుల్ డీటెయిల్ట్ రిపోర్ట్ పంపించాలని చైనా ప్రభుత్వాన్ని కోరింది.

Also read:

ఉత్తర చైనాలో గత మూడు ఏళ్లలో సరిగ్గా ఇదే టైంలో సుమారు అక్టోబర్‌ మధ్య కాలంలో ఈ ఇన్‌ఫ్లూయెంజా లాంటి వైరల్‌ జబ్బులు అధికమైనట్లు డబ్బ్యూహెచ్‌వో అంటోంది. ఇలాంటి అనారోగ్యం బారిన పడిన వారిని దూరంగా ఉంచడం, టీకాలు వేయించడం, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం మాస్క్‌లు వంటివి ధరించడం తదితర చర్యలు తీసుకోవాలని చైనా ప్రజలకు సూచించింది డబ్ల్యూహెచ్‌ఓ. అసలు కరోనా ఆంక్షలను ఎందుకు తొలగించారంటూ చైనా మీద సీరియస్ కూడా అయ్యింది.

కరోనా ఆంక్షాలను తొలగించాక దేశంలో శ్వాసకోశ వ్యాధులు అధికమైనట్లు డబ్ల్యూహెచ్‌ఓకి చైనా నేషనల్ హెల్త్ కమిషన్ తెలిపింది. కోవిడ్‌-19 రూపాంతరం సార్క్‌ కోవిడ్‌-2.. ఇన్‌ఫ్లుఎంజా, మైక్రోప్లాస్మా న్యుమోనియా వంటి వ్యాధులకు దారితీస్తున్నట్లు కరోనా మహమ్మారి ప్రారంభంలోనే డబ్ల్యూహెచ్వో హెచ్చరించింది కూడా.

#who #pneumonia #china #virus
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe