Parliament : మోడీ పదేళ్ళ పాలన మీద కాంగ్రెస్ బ్లాక్ పేపర్..

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రహుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. దీనికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ మోడీ పదేళ్ళ పాలన మీద బ్లాక్ పేపర్ తీసుకుని వచ్చింది.

New Update
Parliament : మోడీ పదేళ్ళ పాలన మీద కాంగ్రెస్ బ్లాక్ పేపర్..

Congress Releasing Black Paper : ఎన్నికల(Elections) ముందు జరుగుతున్న చివరి పార్లమెంటు సమావేశాలు(Parliament Meetings) చాలా హాట్ హాట్‌గా జరుగుతున్నాయి. నిన్న , మొన్న ప్రధాని మోడీ(PM Modi) ఇరు సభల్లో కాంగ్రెస్(Congress) మీద విరుచుకుపడ్డారు. ఇప్పడు దానికి గట్టి జవాబు ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. పార్లమెంటులో తమ పదేళ్ళ పాలన మీద కేంద్ర ప్రభుత్వం శ్వేత పత్రాన్ని విడుదల చేయనుంది. దీనికి విరుద్ధంగా ఇదే అంశం మీద కాంగ్రెస్ బ్లాక్ పేపర్‌ను ప్రకటించాలని డిసైడ్ అయిందని తెలుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikarjun Kharge) దీన్ని తీసుకువచ్చారు.

Also Read : Telangana : ఫ్లోర్ లీడర్ లేకుండానే బడ్జెట్ సమావేశాలకు బీజేపీ

బడ్జెట్‌లో శ్వేతపత్రం విడుదల..

నాలుగు రోజు క్రితం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బీజేపీ(BJP) పదేళ్ళ పాలన మీద శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తామని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వ 10 ఏళ్ళ ఆర్ధిక ప్రగతిని... బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే(NDA) ప్రభుత్వ పదేళ్ళ ఆర్ధిక ప్రగతిని పోలుస్తూ శ్వేత పత్రాన్ని విడుదల చేస్తామనిచెప్పారు. 2014 వరకు దేశం ఎక్కడ ఉంది...ఇప్పుడు ఎంత ప్రగతిని సాధించింది అని చెప్పడమే దీని ఉద్దేశమని తెలిపారు. ఏళ్ళకు ఏళ్ళు చేసిన దుర్వినియోగం నుంచి పాఠాలు నేర్చుకోవడమే ఏకైక ఉద్దేశమని నిర్మలా సీతారామన్ తెలిపారు. కాంగ్రెస్ పాలనలో కంటే బీజేపీ పాలనలోనే ఆర్ధిక ప్రగతి ఎక్కువగా అయిందని అంటున్నారు. ఇవాళో, రేపో శ్వేత పత్రాన్ని విడుదల చేస్తారు. రేపటితో పార్లమెంటు సమావేశాలు ముగియనున్నాయి.

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా..

అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతో చేస్తోందో అదే పనిని కాంగ్రెస్ కూడా చేస్తామని చెబుతోంది. తమ పాలనలో ఆర్ధిక ప్రగతిని బీజేపీ ఎత్తి చూపిస్తే...ఎన్డీయే పాలనలో దేశం ఎంత తిరోగమించిందో తాము చూపిస్తామని కాంగ్రెస్ అంటోంది. శ్వేత పత్రానికి వ్యతిరేకంగా బ్లాక్ పేపర్‌ను ప్రవేశపెట్టింది. ఈ పేపర్‌లో పదేళ్ల నరేంద్ర మోదీ పాలన వైఫల్యాలను ఎండగట్టనుననట్లు తెలుస్తోంది. బీజేపీ హయాంలో పెరిగిన ధరలు, నిరుద్యోగం రేటు తదితర అంశాలను బ్లాక్ పేపర్‌లో వివరించారని సమాచారం. దీనిని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్ సభలో ప్రవేశపెట్టారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. పార్లమెంటు సమావేశాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి.

Also Read : Penny Stocks: ఇది కదా కిక్ అంటే..ఆరునెలల్లో లక్ష రూపాయలను 3లక్షలు చేసిన షేర్..

Advertisment
తాజా కథనాలు