Wheat Flour Facial: ముఖాన్ని మెరిసేలా చేసే గోధుమపిండి ఫేషియల్‌

గోధుమ పిండిని మంచి ఫేస్‌మాస్క్‌గా ఉపయోగించవచ్చు. రోజ్ వాటర్, కాఫీ పౌడర్, గోధుమపిండి, కొబ్బరి నూనె ముఖానికి చాలా మేలు చేస్తాయి. చర్మం పొడిబారడాన్ని నివారించడానికి రోజ్ వాటర్ బాగా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. గోధుమ పిండి ఫేషియల్ చేసుకోవడం వల్ల చర్మం మెరిసిపోతుంది.

New Update
Wheat Flour Facial: ముఖాన్ని మెరిసేలా చేసే గోధుమపిండి ఫేషియల్‌

Wheat Flour Facial: ఎండలోకి వెళ్తే చర్మానికి అనేక సమస్యలు వస్తాయి. చర్మం అలసిపోయి, పొడిబారి పూర్తిగా మురికిగా మారుతుంది. బ్యూటీ పార్లర్స్‌కి వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన పనిలేకుండా ఇంట్లోనే చిన్న చిన్న ఫేషియల్స్‌ని తయారు చేసుకోవచ్చు.ఇంట్లో ఫేషియల్‌ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

రోజ్‌ వాటర్‌:

  • రోజ్ వాటర్, కాఫీ పౌడర్, గోధుమపిండి, కొబ్బరి నూనె ముఖానికి చాలా మేలు చేస్తాయి. చర్మం పొడిబారడాన్ని నివారించడానికి రోజ్ వాటర్ బాగా ఉపయోగపడుతుంది. మీరు ఎండలో వెళ్లాల్సి వస్తే కొద్దిగా చల్లటి రోజ్ వాటర్‌ను ముఖానికి అప్లై చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కొబ్బరి నూనె చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మంచి కొవ్వుల మూలం. ముఖం ప్రకాశవంతంగా, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.

కాఫీ పొడి:

  • కాఫీ పౌడర్ కూడా మంచి స్క్రబ్. ఇది ముడతలను తొలగించి చర్మం కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది. ఇది చాలా ఫేస్‌ప్యాక్‌లలో దీన్ని వాడుతారు. దీన్ని చర్మానికి ఫేస్‌మాస్క్‌గా, స్క్రబ్బర్‌గా ఉపయోగించవచ్చు.

గోధుమ పిండి:

  • గోధుమ పిండిని మంచి ఫేస్‌మాస్క్‌గా ఉపయోగించవచ్చు. కాఫీ పొడి, రోజ్ వాటర్, గోధుమ పిండి, పెరుగు కలిపి వినియోగించవచ్చు. పెరుగు బ్లీచింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. సన్ బర్న్డ్ స్కిన్‌కు ఇది బెస్ట్ రెమెడీ. గోధుమ పిండిని మంచి ఫేస్ మాస్క్‌గా ఉపయోగించవచ్చు. ముఖం శుభ్రంగా కడుక్కుని తుడుచుకున్న తర్వాత ఈ పదార్థాలను మిక్స్ చేసి ముఖానికి పట్టించాలి. తర్వాత నెమ్మదిగా మీ ముఖాన్ని స్క్రబ్ చేయాలి. ముఖంలోని డెడ్‌స్కిన్‌ను తొలగించేందుకు ఇది చాలా బాగా సహాయపడుతుంది. వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఇంట్లో ఈ గోధుమ పిండి ఫేషియల్ చేసుకోవడం వల్ల చర్మం మెరిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ఈ సమస్యలు ఉన్న పురుషులు పచ్చి ఉల్లిపాయలు తినాల్సిందే

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు