Elections 2024: ఎన్నికల ఫలితాలు ఎలాంటి పాఠాలు నేర్పుతున్నాయి?

ఈసారి ఎన్నికలు పెద్ద సంచలనం. ఓటర్లు తమకు నచ్చినవారికి ఓటు వేసి లౌకికత్వాన్ని చాటుకున్నారు. రాజకీయాలకు, మతాలకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఓటర్లు తమలో ఉన్న రాజకీయ పరిపక్వతను చాటుకున్నారు.

Elections 2024: ఎన్నికల ఫలితాలు ఎలాంటి పాఠాలు నేర్పుతున్నాయి?
New Update

Election Results 2024: లోక్‌సభ ఎన్నికల ఫలితాల నుంచి ఈసారి నేర్చుకోవలసింది ఎంతో ఉందని అంటున్నారు. ఓటర్లు తమలో ఉన్న రాజకీయ పరిపక్వతను చాటుకున్నారు. మతాన్ని రాజకీయాలతో కలపకుండా...దానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. మతంపై ఫోకస్ పెట్టిన బీజేపీకి షాక్ ఇచ్చారు . ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతులు, దళితుల సమస్యలు లాంటి వాటిని పక్కన పెట్టి హిందూత్వం, మతం లాంటి వాటికి పెద్ద పీట వేసిన బీజేపీకి బుద్ధి చెప్పారు. దాని ఫలితమే ఆ పార్టీకి మెజార్టీ రాకపోవడం.

అయోధ్య రామాలయం, హిందూత్వం లాంటి అంశాలకు భారతీయ ప్రజలు మద్దతు పలికినా...ఎన్నికల సమయం వచ్చేసరికి మాత్రం భావోద్వాగాలకు కాకుండా మిగతా వాటికి ప్రధాన్యం ఇచ్చారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం తమను భారీ మెజారిటీతో తిరిగి తమను అధికారంలోకి వస్తుందని పార్టీ నాయకత్వం గట్టిగా నమ్మింది. కానీ ప్రజలు దానికి వ్యతిరేకంగా తీర్పును చెప్పారు. ప్రజలు వీటికి లొంగలేదు. ఎవరూ అజేయులు కాదని నిరూపించారు. వారణాసిలో మోదీ గెలిచినప్పటికీ...కాంగ్రెస్ అభ్యర్ధికి మార్జిన్ చాలా తక్కువగా ఉంది. అంతేకాదు ఆయన కలలు కన్న 370 సీట్లు సాధించడంలో కూడా విఫలమయ్యారు.

మరోక ముఖ్యమైన విషయం ఏంటంటే..ఈసారి ఎన్నికలు ప్రధానంగా పార్టీ పేరుతో కాకుండా...ప్రధాని మోదీ పేరు మీదనే జరిగాయి. కానీ ఓటర్ల తీర్పు మాత్రం దానికి వ్యతిరేకంగా ఉంది. ఆయనను ప్రజలు వ్యతిరేకించారు. కానీ మోదీ మాత్రం దీన్ని గౌరవించలేదు. తాను ప్రధానిని కాలేనని ప్రకటించలేకపోయారు. దీని ద్వారా మోదీలో రాజనీతిజ్ఞత లేదని తెలిసిపోతోంది. ప్రస్తుతం మూడోసారి కూడా మోదీనే ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు. అయితే ఈసారి ఈయనకు ఇది కఠినంగా మారనుంది. బీజేపీకి పూర్తి మెజారిటీ రానందువలన మిత్ర పక్షాల మీద ఆధారపడవలసి వచ్చింది. ఇది బీజేపీ ప్రభుత్వానికి కష్టతరమైన పరిస్థితి. ఇప్పుడు ఆపార్టీ కానీ, మోదీ కానీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా మిత్ర పక్షాల అనుమతి తీసుకోవాల్సిందే. టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ అధినేత నితీష్ కుమార్‌ల అనుమతి లేనిదే ఏ పెద్ద నిర్ణయమూ బీజేపీ ప్రభుత్వం అమలు పర్చలేరు. ఇది మోదీకి శాపంగా మారనుంది. గత పదేళ్ళుగా మంత్రివర్గంలోని ఇతర సభ్యులను పరిగణనలోకి తీసుకోకుండా చాలా సందర్భాల్లో తనకు నచ్చిన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ నియంతృత్వ ధోరణిలో మోదీ వ్యవహరించారు. ఇప్పుడు అలా జరగడానికి వీలు లేదు. చంద్రబాబు, నితీష్ కుమార్ కేంద్ర మంత్రివర్గంలో చేరకపోయినా.. కేబినెట్‌లో బలమైన అభ్యర్ధులుగా ఉంటారు.

Also Read: ఎన్డీయే లోకి కొత్త పార్టీలు వచ్చే ఛాన్స్ ఉందా? బీజేపీ ఏం చేయబోతోంది?

ఇక ఎన్డీయే భాగస్వాములు ఇద్దరూ తాము మద్దతు ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వంలో తమకు ప్రధాన మంత్రిత్వ శాఖలను ఇవ్వాలని కోరుతున్నారు. అదీ కాక ఆంధ్ర, బీహార్ రెండు రాష్ట్రాలకూ ప్రత్యేక హోదాను ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఒకవేళ కనుక ప్రధాన శాఖలు టీడీపీ, జేడీయూ వశమైతే...మోదీ ఏం చెప్పినా మంత్రులు అంగీకరించారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు, నితీష్ చేతుల్లోకి పగ్గాలు ఉండి మోదీ శక్తిలేని ప్రధానిగా అయిపోతారు. ఏపని చేయాలన్నా..టీడీపీ, జేడీయూలకు ఆయన జవాబుదారీగా మారనున్నారు.

మొత్తానికి బీజేపీకి సంఖ్యా బలం ఉన్నప్పటికీ..మూడోసారి మోదీ ప్రధానిగా అస్థిర ప్రభుత్వాన్నే నడిపిస్తారనే చెప్పాలి. ఒకవేళ కనుక బీజేపీ ప్రభుత్వం టీడీపీ, జేడీయూ అధినేతల మాట వినకపోతే..వారు ఎన్డీయేను విడిచిపెట్టి ఇండియా కూటమితో చేతులు కలపరనడానికి ఎటువంటి సందేహం లేదు. వీటన్నింటినీ ప్రధానిగా మోదీ ఎలా నెట్టుకొస్తారో వేచి చూడాల్సిందే.

#bjp #elections #voters #modi #india #election-results-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe