దొంగతనానికి పాల్పడుతున్నారన్న అనుమానంతో.. ఇద్దరు మహిళలను(Two Womens) అక్కడి స్థానికులు వివస్త్రలను చేశారు. స్థానికుల్లో చాలామంది మహిళలే ఉండటం గమనార్హం. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో(Social Media) వైరల్గా (Viral) మారాయి. ఈ ఘటనపై మాల్దా (Malda)పోలీస్ సూపరిటెండెంట్ (S.P)ప్రదీప్ కుమార్ జాదవ్ స్పందించారు. ఈ విషయంపై మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. అయినా సుమోటోగా తీసుకుని దర్యాప్తు చేసేందుకు సీనియర్ అధికారులను ఆ గ్రామానికి పంపించాం. గుర్తు తెలియని వ్యక్తుల కేసు నమోదు (Case File)చేశారు. నిందితులను కనుగొనడానికి మేము వీడియోను(Video)జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని తెలిపారు.
టీఎంసీ(TMC), బీజేపీ (BJP)మధ్య మాటల యుద్ధం:
ఈ ఘటన తర్వాత బెంగాల్(Bengal)లో అధికార టీఎంసీ(TMC),బీజేపీ (BJP) మధ్య మాటల యుద్ధం మొదలైంది. మహిళల భద్రతను లక్ష్యంగా చేసుకుని మమతా బెనర్జీ (Mamatha Benerji)ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే బీజేపీ అనవసరంగా ఈ ఘటనను రాజకీయం చేస్తోందని.. టీఎంసీ(TMC) విమర్శించింది. ఇద్దరు మహిళలపై దాడికి సంబంధించిన వీడియోను బీజేపీ ఐటీ విభాగం హెడ్ అమిత్ మాల్వియా ట్విట్టర్(Twitter)లో పోస్ట్ చేశారు. బెంగాల్‌లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. మాల్దా జిల్లాలో జులై 19న ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్రలను చేసి.. కనికరం లేకుండా కొట్టారు. మమతాబెనర్జీ హృదయం విరిగిపోయేలా ఉంది ఈ ఘటన. కానీ ఆమె మణిపుర్(Manipur) ఘటనపై స్పందించింనంతలా సొంత రాష్ట్రంలో జరిగిన దారుణంపై నోరు విప్పలేదు. బెంగాల్ ముఖ్యమంత్రి (Bengal C.M) ఆమెనే కాబట్టి ఏం పట్టించుకోకూడదని నిర్ణయించుకున్నారేమో. ముఖ్యమంత్రిగా రాష్ట్రంలోని వైఫల్యాలను బహిర్గతం చేసినట్టు ఉంటుందని.. కనీసం బాధను కూడా వ్యక్తం చేయలేదని ఆరోపించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ రియాక్షన్:
ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్(Sukantha Majundhar) కూడా స్పందించారు. బెంగాల్‌లో మణిపూర్ (Manipur) తరహా పరిస్థితి నెలకొందని ఆరోపించారు. జులై 8న జరిగిన రూరల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన ఓ మహిళా బీజేపీ అభ్యర్థిని కొందరు వివస్త్రను ఊరేగించారని ఆయన ఆరోపణలు చేశారు. బీజేపీ చేసిన ఆరోపణలపై బెంగాల్ మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి శశి పంజా స్పందించారు. మాల్దా ఘటనను బీజేపీ రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. అది ఓ దొంగతనం కేసు. ఇద్దరు మహిళలు మార్కెట్‌లో ఏదో దొంగిలించడానికి ప్రయత్నించారు. దీంతో కొంతమంది మహిళలు వారిద్దరిని కొట్టారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. సుమోటోగా(Sumoto) కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారని ఆమె తెలిపారు. మాల్దా ఘటనను మణిపుర్‌తో పోల్చవద్దని సీపీఐ నేత బృందా కారత్(Cpi leader brunda kharath) కోరారు. బెంగాల్‌లో ఆదివాసీ మహిళలపై పలువురు మహిళలు దాడి చేయడం బాధాకరమని ఆమె ఆరోపించారు.