Floods : తెగిన రోడ్లు.. కొట్టుకుపోయిన కార్లు.. వరద బీభత్సం
భారీ వర్షాలతో గురజరాత్ అతలాకుతలమవుతుంది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. అహ్మదాబాద్, సూరత్ సహా పలు జిల్లాల్లో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది.
భారీ వర్షాలతో గురజరాత్ అతలాకుతలమవుతుంది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. అహ్మదాబాద్, సూరత్ సహా పలు జిల్లాల్లో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది.
తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశాలున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది.
ఉత్తరాఖండ్ కేదార్నాథ్లోని గాంధీ సరోవర్పై హిమపాతం సంభవించింది. ఆదివారం ఉదయం 5 గంటలకు పర్వతం మీద నుంచి మంచు ఒక్కసారిగా కిందికి జారింది. దీంతో యాత్రికులంతా ఉలిక్కిపడ్డారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకపోగా వీడియో వైరల్ అవుతుంది.
ఉత్తర ఒడిశా తీరం సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణశాఖాధికారులు తెలిపారు. అయితే ఈ అల్పపీడనం ప్రభావం తెలంగాణ రాష్ట్రం పై పెద్దగా ఉండదని..అయినప్పటికీ కూడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది
రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.వాయువ్య బంగాళాఖతం వద్ద సగటు సముద్ర మట్టానికి 1.5 నుండి 5.8 కి. మీ. మధ్య ఉన్న ఆవర్తనం శుక్రవారం కూడా అదే ప్రాంతంలో కొనసాగుతుందని ఐఎండీ పేర్కొంది.
తెలంగాణలోని అల్వాల్, కంటోన్మెంట్, ఉప్పల్, ఎల్బీ నగర్, చాంద్రాయణగుట్ట, రాజేంద్ర నగర్, కార్వాన్, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ అధికారులు తెలిపారు.
నేపాల్ ను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగి పడటంతో పాటు, పిడుగులు పడటం వల్ల 20 మంది చనిపోయారు.కొండచరియలు విరిగిపడటంతో 3 ఇళ్లు వరదలల్లో కొట్టుపోగా...ఆ ఇళ్లలో ఇద్దరు చిన్నారులతో పాటు 4 గురు మరణించారని జిల్లా అధికారులు ప్రకటించారు.
TG: రాష్ట్రంలో రేపు, ఎల్లుండి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఖమ్మం, కరీంనగర్, భద్రాది కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఐఎండీ అధికారులు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది.