/rtv/media/media_files/2025/10/29/cyclone-montha-2025-10-29-11-42-10.jpg)
Cyclone Montha
Cyclone Montha: ప్రతీ తుఫానుతో ప్రజలకు వచ్చే ప్రమాదాన్ని గుర్తు చేయడానికి, ఆ తుఫాను ను సులభంగా గుర్తించడానికి, సమయానుకూల హెచ్చరికలు ఇచ్చేందుకు ప్రత్యేకమైన పేర్లను పెడతారు. తుఫాన్ల వేగం కనీసం 61 కి.మీ. (39 mph) చేరినప్పుడు మాత్రమే అధికారికంగా పేర్లు పెట్టడం ప్రారంభిస్తారు.
తుఫాన్ ఏర్పడే విధానం ఇలా ఉంటుంది..
వేడి గాలి పైకి ఎగిరి, చల్లని గాలి కిందకు వస్తుంది. గాల్లోని ఆవిరి ఘనీభవించి, మంచు స్పటికాలు, మేఘాలు ఏర్పడతాయి. గాలి మరింత బలపడితే తుఫాన్ రూపం దాల్చుతుంది. పేర్లను పెట్టడం వెనుక ముఖ్య ఉద్దేశ్యం స్పష్టమైన కమ్యూనికేషన్ కోసం. తుఫాన్ ఏ ప్రాంతాల్లో తీవ్ర వర్షాలు, గాలి, నష్టం కలిగించగలదో ప్రజలకు ముందే హెచ్చరించడం కోసం ఆ తుఫాన్ కు పేరు ఎంతో అవసరం. సముద్రంలో చేపల వేట, పడవల సురక్షత కోసం కూడా హెచ్చరికలు ఇచ్చే విధంగా శాస్త్రవేత్తలు పేర్లను ఉపయోగిస్తారు.
ప్రపంచవ్యాప్తంగా తుఫాన్లకు పేర్లు పెట్టే విధానం ప్రాంతాల వారీగా భిన్నంగా ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్, వరల్డ్ మెట్రాలజికల్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా 2000లో ఈ సంప్రదాయాన్ని ప్రారంభించింది. ప్రపంచంలో ఆరు ప్రధాన వాతావరణ కేంద్రాలు, ఐదు ప్రాంతీయ ఉష్ణమండల తుఫాను హెచ్చరిక(Weather Updates) కేంద్రాలు ఉన్నాయి. భారతదేశంలో ఐఎండీ (Indian Meteorological Department) కూడా ఇందులో భాగం. ఈ కేంద్రాలు 13 సభ్య దేశాలుగా తయారుచేసిన పేర్ల జాబితా ఆధారంగా తుఫాన్లకు పేరు ఎంపిక చేస్తాయి.
పేర్లను ఎంచుకునేటప్పుడు ఈ నిబంధనలు పాటిస్తారు..
- రాజకీయ, మత, లింగ, సాంస్కృతిక వివాదాలకు దూరంగా ఉండాలి
- క్రూరత్వాన్ని సూచించకూడదు
- సులభంగా గుర్తు పెట్టుకునేలా ఉండాలి
- ఇంగ్లీషులో 8 అక్షరాల కంటే ఎక్కువ ఉండకూడదు
- మళ్ళీ అదే పేరు వాడరు
ప్రతి ప్రాంతానికి తుఫాన్లకు ప్రత్యేకతను ప్రతిబింబించేలా స్థానిక భాషల, సంప్రదాయాల పేర్లను ఉపయోగిస్తారు. ఉదాహరణకు, హిందూ మహాసముద్రం, బంగ్లా ఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడే తుఫాన్లకు ప్రాంతీయ దేశాలు పేర్లను నిర్ణయిస్తాయి. 2019లో దక్షిణాసియాలో ఏర్పడిన “ఫణి” తుఫాన్‌కు బంగ్లాదేశ్ పేరు పెట్టింది. ఈ విధంగా, తుఫాన్లకు పేర్లు పెట్టడం వలన ప్రజలకు స్పష్టమైన హెచ్చరికలు, సురక్షిత పద్ధతులు, సమయానికి సమాచారం అందించడం సులభం అవుతుంది.
Follow Us