తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశమున్నట్లు సమాచారం. కాబట్టి బయటకు వెళ్లే వాళ్లు జాగ్రత్తని అధికారులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: ఐపీఎల్ 2025 రిటెన్షన్.. అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీళ్లే!
ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్..
నైరుతి బంగాళాఖాతం కారణంగా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, భూపాలపల్లి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయని ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. వాతావరణంలో మార్పులు వల్ల నిన్నటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి.
ఇది కూడా చూడండి: సినిమా లెవల్‌లో గంజాయి అక్రమ రవాణా.. స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఏపీలో మన్యం, కృష్ణా, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి వర్షాలు కురుస్తాయి. రైతులు కాస్త జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నాన్నారు. ఎందుకంటే పొలాల్లో ఉరుములు, మెరుపులు కూడా వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. అలాగే మృత్సకారులు వేటకు వెళ్లవద్దని కూడా అధికారులు సూచిస్తున్నారు.
ఇది కూడా చూడండి: దాడికి సిద్ధమవుతున్న ఇరాన్.. ఈసారి మూడో ప్రపంచ యుద్ధమే!
ఇదిలా ఉండగా.. ఇటీవల దానా తుపాను వచ్చింది. ఈ తుపాను ప్రభావం ఒడిశా, పశ్చిమ బెంగాల్‌తో పాటుగా ఏపీలో ఎక్కువగా ఉండేది. ఈ తపాను వల్ల ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో భారీగా వర్షాలు పడ్డాయి. ఉత్తరాంధ్రలోని కళింగ పట్నం, భావనపాడు పోర్టులకు రెండో నంబర్ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఉత్తరాంధ్రలో ఈ తుపాను వల్ల భారీ వర్షాలు కురిశాయి.
ఇది కూడా చూడండి: స్పెయిన్‌లో వరద విలయ తాండవం.. కుప్పకుప్పలుగా మృతదేహాలు!