Rain Alert: దేశ వ్యాప్తంగా రుతుపవనాలు చురుకుగా ముందుకు కదులుతున్నాయి.ఈ క్రమంలోనే భారత వాతావరణశాఖ మంగళవారం గుజరాత్, మహారాష్ట్ర, గోవాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా.. మరో ఏడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది. మరో ఐదు రోజుల పాటు ఢిల్లీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్మెంట్ అంచనా వేసింది. ఈ రోజు ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్‌గా ఉండొచ్చని వాతావరణశాఖ తెలిపింది.
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం తొమ్మిది రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ అవకాశం ఉందని తెలిపింది. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలు ఉన్నాయి. దీంతో పాటు జార్ఖండ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాల్లో కూడా వర్షాలు ఓ మోస్తరు నుంచి భారీగా కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ వివరించింది.