Viral Video: నడిరోడ్డు పై మహిళ వింతపూజలు!

మధ్యప్రదేశ్‌లోని జబల్ పూర్‌ లో తాజాగా ఓ షాకింగ్‌ వీడియో బయటకు వచ్చింది.ఈ వీడియోలో వేగంగా దూసుకోస్తున్న వాహనాల మధ్య రోడ్డు మధ్యలో ఓ మహిళ పూజలు చేస్తోంది. నడి రోడ్డు పై మంటలు పెట్టి కొన్ని మంత్రాలు చదువుతూ వింత వింతగా ప్రవర్తించింది.

New Update
Viral Video: నడిరోడ్డు పై మహిళ వింతపూజలు!

Madhyapradesh: మధ్యప్రదేశ్‌లోని జబల్ పూర్‌ లో తాజాగా ఓ షాకింగ్‌ వీడియో బయటకు వచ్చింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో వేగంగా దూసుకోస్తున్న వాహనాల మధ్య రోడ్డు మధ్యలో ఓ మహిళ పూజలు చేస్తోంది. నడి రోడ్డు పై మంటలు పెట్టి కొన్ని మంత్రాలు చదువుతూ వింత వింతగా ప్రవర్తించింది.

ఆ మహిళ చేతబడి చేస్తోందని కొందరు భయపడిపోయారు. మరికొందరు దీన్ని వింతగా చూడగా... ఇకపోతే ఆ మహిళ చేస్తున్న పనిని చూసిన అక్కడి ప్రజలు తమ వాహనాలు ఆపేసి మరి కొంతదూరంలో నిలబడిపోయారు. నడిరోడ్డు మార్గమధ్యలో ఆమె ఇదంతా ఎందుకు చేస్తుందో ఎవరికీ అర్థం కాలేదు. ఈ షాకింగ్‌ ఘటన మధ్యప్రదేశ్‌ లోని జబల్‌పూర్‌లో జరిగింది.

నడి రోడ్డు మధ్యలో ట్రాఫిక్‌ ను ఆపి మరి మహిళ పూజలు చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ విషయంపై నగర పోలీసులు విచారణ చేపట్టారు. ఈ వీడియోలో మహిళ రోడ్డు మధ్యలో ఓ వాటర్ బాటిల్, నూనె, బ్యాగ్ తీసుకుని కూర్చుంది. ఆ తరువాత అక్కడ ఒక్కసారిగా మంటలు కూడా కనిపించాయి. ఆ తర్వాత ఆమె నిలబడి కాస్త వింతగా అక్కడ ఉన్న వాహనదారులను చూడటం మొదలు పెట్టింది. ఈ ఘటనతో భయపడిపోయిన వారు రోడ్డుపై అక్కడిక్కడే ఆగిపోయారు.

అలా ఉండగానే మహిళా ఆ మంట చుట్టూ ఎగురుతూ, దూకుతూ అటు ఇటు తిరుగుతూ వింతగా ప్రవర్తించింది. ఆపై మంటల ముందు కూర్చుని తన జుట్టును విరబోసుకుని చాలా విచిత్రంగా చేసింది. ఇది చూసిన కొందరు భయపడినా.. ఆ తరువాత ఒక్కొక్కరుగా ఆ ప్రదేశం నుండి పక్కకి వెళ్లిపోయారు. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. మహిళ మానసిక పరిస్థితి సరిగా లేదని తెలిసింది.

Also read: మొన్న మైక్రోసాఫ్ట్‌.. నిన్న యూట్యూబ్‌..కొద్దిసేపు నిలిచిన సేవలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు