Weather: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన..

వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే ఏర్పడిన అల్పపీడనానికి తోడుగా మరో అల్పపీడనం ఏర్పడిందన్నారు. దీని ప్రభాంతో ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు అధికారులు.

New Update
Weather: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన..

Heavy Rain Alert: పొద్దెక్కితే ఎండ మంట.. పొద్దు తిరిగితే చలి పులి పంజా.. ఇలా విచిత్ర వాతావరణం(Weather)తో ప్రజలు అల్లాడుతున్న వేళ కీలక ప్రకటన చేసింది వాతావరణ కేంద్రం. తెలుగు రాష్ట్రాల్లో(Andhra Pradesh & Telangana) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి తోడుగా ఒకటి రెండు రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 5 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

ఇదిలాఉంటే.. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తం.. బుధవారం నాటికి అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) అధికారులు చెప్పారు. ప్రస్తుతం బంగాళాఖాతం ఆగ్నేయ, నైరుతి దిశలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది నవంబర్ 15వ తేదీన ఆల్పపీడనంగా మారనుందని తెలిపారు. ఈ అల్పపీడనం కారణంగా ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ కేంద్రం. కాగా, ఇప్పటికే పెరుగుతున్న చలితో అల్లాడుతున్న జనాలకు వర్షం అలర్ట్.. మరింత వణుకు పుట్టిస్తోంది.

Also Read:

టార్గెట్ నకిరేకల్.. వేముల వీరేశం ఓటమికి కేసీఆర్ స్కెచ్ ఇదే!

మేం అధికారంలోకి వస్తే ఉచితంగా అయోధ్య రాముడి దర్శనం..!!

Advertisment
తాజా కథనాలు