ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య యుద్ధం తీవ్రతరం అవుతోంది. గాజా మీద ఇజ్రాయెల్ సైన్యం వరుస దాడులు చేస్తోంది. హమాస్ కూడా ఏమీ తగ్గటం లేదు. ఒకరిని ఒకరు క్రూరంగా చంపుకుంటున్నారు. వీటికి తోడు ఇప్పుడు హమాస్ కమాండర్ తన కుటుంబ సభ్యులకు ఇచ్చిన సందేశం ఈ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసేలా ఉన్నాయి. ఇజ్రాయెల్ ను దెబ్బ తీయటం తమ మొదటి టార్గెట్...కానీ దాన్ని మొత్తం ప్రపంచానికి చూపించాలని అనుకుంటున్నాము అంటూ హమాస్ కమాండర్ మహ్‌మౌద్ అల్ జహార్ ప్రకటించాడు. తమ ప్రభావం మొత్తం వరల్డ్ మీద పడేలా చేయడమే తమ ఉద్దేశమని చెప్పాడు.
అల్ జహర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అతనితో పాటూ హమాస్ సీనియర్ అధికారులుకూడా ఉన్నారు. ప్రపంచంలో ఎలాంటి అన్యాయం, అణిచివేత లేని వ్యవస్థ రావాలి, దాని కోసమే మా పోరాటం అని జహార్ చెబుతున్నాడు. లెబనాన్, సిరియా, ఇరాక్లాంటి దేశాల్లో అరబ్, పాలస్తీనియన్లకు జరుగుతున్న అన్యాయం ఇంకెవరికీ జరగకూడదు అని అతను అంటున్నాడు.
ఇజ్రెయెల్,పాలస్తీనా యుద్ధం నెమ్మదిగా ఇతర దేవాల మీదా ప్రభావం చూపిస్తోంది. ఇది మరిన్ని దేశాలకు పాకే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే హమాస్ కమాండర్ విడుదల చేసిన ఈ వీడియో వచ్చిన కాసేపటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఓ ప్రకటన జారీ చేశారు. హమాస్ కు వ్యతిరేకంగా తమ పోరు కొనసాగుతుందని, వాళ్ళని పూర్తిగా నాశనం చేయడమే తమ లక్ష్యమని నెతన్యాహు హెచ్చరించారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ గాజాలో తన దాడులను మరింత ఎక్కువ చేయనుంది. ఇప్పటివరకు విమానదాడులకు పాల్పడుతున్న ఇజ్రాయెల్ సైన్యం ఇకపై ఆ నగరంలోకి చొచ్చుకుని వెళ్ళాలని కూడా ప్లాన్ చేస్తోంది.
ఇంత ఘోరం చూస్తా అనుకోలేదు...
మరోవైపు ఇజ్రాయెల్‌లో హమాస్ దాడుల మీద అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పందించారు. చిన్న పిల్లల తలలను తెగ్గోయడం చూస్తానని కలలో కూడా అనుకోలేదని అన్నారు. మొదటి నుంచి ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేస్తున్న అమెరికా...ఉగ్రవాదాన్ని సహించేది లేదంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఉద్రిక్తతలను పెంచే చర్యలను చేయవద్దంటూ బైడెన్ ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. యూదు ప్రజల భద్రతకు ఎప్పుడూ కట్టుబడి ఉంటామని ఆయన అన్నారు. ఇజ్రాయెల్‌తో కలిసి పని చేస్తామని తెలిపారు.
Also Read:ఈ పండగ నుంచి పెద్ద పండగ వరకూ గుంటూరు కారం మోత మోగుతుంది