అన్ని చర్యలూ తీసుకుంటాం..ఆందోళనలు వద్దు–సీఎం చంద్రబాబు

వరద ప్రాంతాల్లో బాధితుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బాధితులు ఆందోళన చెంద వద్దని ఆయన అన్నారు. దీంతో పాటూ మరోసారి బుడమేరు ముంపు రాకుండా చర్యలు తీసుకుంటామని బాబు చెప్పారు.

New Update
అన్ని చర్యలూ తీసుకుంటాం..ఆందోళనలు వద్దు–సీఎం చంద్రబాబు

AP CM Chandra Babu: విజయవాడలో వరదలు రావడానికి కారణమైన బుడమేరు వాగును స్ట్రీమ్ లైన్ చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. వాగు నీరు నేరుగా కృష్ణా నదికి వచ్చేలా...దారిలో అడ్డంకులు అన్నీ తొలగిస్తామని తెలిపారు. విజయవాడకు భవిష్యత్తులో నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపడతామని చెప్పారు. అస్నా తుఫాను ఇటు వచ్చే ఛాన్స్ లేదు అయినా జాగ్రత్త చర్యలు ముందుగానే తీసుకుంటాన్నామని ఆయన తెలిపారు.

అలాగే వరద ప్రాంతాల్లో బాధితులు ఆందోళన చెందవద్దని చంద్రబాబు అన్నారు. అక్కడ అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. తాగు నీటి కోసం ట్యాంకర్లను అందుబాటులోకి తీసుకు వస్తామని...ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లొ ప్రతీ ఇంటినీ శుభ్రం చేయించి..రోడ్ల మీద బురదను కూడా తొలగించే పనులు చేపట్టనున్నామని తెలిపారు.డ్రోన్ల ద్వారా అనేక మందికి ఆహారం అందించాం. ఆహార పదార్థాలు బాధితుల చేతికి నేరుగా అందించాలని ఆదేశాలు ఇచ్చాం. ట్రాక్టర్ల ద్వారా చాలా మందిని బయటకు తీసుకొచ్చాం. అన్ని ప్రాంతాలకు వెళ్లి మరింతగా ఆహారం, తాగునీరు పంపిణీ చేస్తామని చెప్పారు. ఇక వర్షాలు, వరదలకు కొట్టుకుపోయిన కార్లు, ఆటోలకు బీమా సొమ్ము వచ్చేలా చేస్తామని తెలిపారు. డ్రోన్ల ద్వారా సర్వే చేయించి పంట నష్టం వివరాలు సేకరిస్తామని హామీ ఇచ్చారు బాబు.

వరదల కారణంగా కలిగిన నష్టం.. అందుకు అవసరమైన సాయంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం. అక్కడ అన్నిరకాలుగా పునరుద్ధరణకు చర్యలు చేపడతామని తెలిపారు.

Also Read: Paris: పారాలింపిక్స్‌‌లో భారత్‌కు మరో ఐదు మెడల్స్..20కు చేరిన మెడల్స్ సంఖ్య

Advertisment
Advertisment
తాజా కథనాలు