Paralympics 2024: పారాలింపిక్స్‌లో మన అథ్లెట్లు అదరగొడతున్నారు. మామూలు ఒలిపింక్స్‌లో ఆటగాళ్ళు నిరాశర్చినా…పారా అథ్లెట్లు మాత్రం ఆశించిన దాని కంటే ఎక్కువగానే పెర్ఫామెన్స్ చేస్తూ పతకాల వేట కొనసాగిస్తున్నారు. ఈరోజు భారత్ ఖాతాలో ఐదు పతకాలు వచ్చి చేరాయి. దీంతో పతకాల సంఖ్య 20కు చేరుకుంది. మరో ఐదు అయినా కచ్చితంగా వస్తాయని పారాలింపిక్స్ ఇండియా కమిటీ ప్రెసిడెంట్ దేవేంద్ర ఝజారియా నమ్మకంగా చెబుతున్నారు. నిన్న ఒక్కరోజులోనే హ్యాట్రిక్ బంగారు మెడల్స్ వచ్చాయి. ఇవాళ జరిగిన పోటీల్లో స్ప్రింట్ దీప్తి జీవన్జీ కి కాంస్యం, మెన్స్ హై జంప్ టీ63లో శరద్‌కు సిల్వర్, మరియప్పన్ తంగవేలు కాంస్యం గెలుచుకున్నారు. వీరితో పాటూ మెనస్ జావెలిన్ త్రో ఎఫ్46లో అజీత్ సిల్వర్, సుందర్ సింగ్ బ్రాంజ్ గెలుచుకున్నారు. పారలింపిక్స్ చరిత్రలో భారత్ ఇన్ని మెడల్స్ సాధించడం ఇదే మొదటిసారి.
పూర్తిగా చదవండి..Paris: పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో ఐదు మెడల్స్..20కు చేరిన మెడల్స్ సంఖ్య
పారిస్‌లో జరుగుతున్న పారా ఒలంపిక్స్‌లో భారత్ తన ఖాతాలో మరో ఐదు మెడల్స్ వచ్చి చేరాయి. దీంతో ఇప్పటి వరకు ఇండియా గెలిచిన పతకాల సంఖ్య 20కి చేరింది. మరో ఐదు అయినా కచ్చితంగా వస్తాయని పారాలింపిక్స్ ఇండియా కమిటీ ప్రెసిడెంట్ దేవేంద్ర ఝజారియా అన్నారు.
Translate this News: