Andhra Pradesh: కేంద్రం సాయం ఇంకా అందలేదు–చంద్రబాబు

కేంద్రం నుంచి సహాయం వచ్చిందన్న మాట అవాస్తవమని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. తాము ఇంకా కేంద్రానికి రిపోర్ట్ పంపలేదని తెలిపారు.ప్రస్తుతం బుడమేరు గండ్లును పూడ్చడమే తమ లక్ష్యమని...అదే పనిలో ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

New Update
Andhra Pradesh: వరదలపై కేంద్రానికి నివేదిక– సీఎం చంద్రబాబు

AP CM Chandrababu: తెలుగు రాష్ట్రాలకు కేంద్ర సాయంపై ఇంకా సమాచారంలేదు. 3300 కోట్ల సహాయం అంటూ వచ్చిన వార్తలన్నీ అవాస్తవమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్రానికి ఇంకా తాము ప్రాథమిక నివేదికలే పంపలేదని తెలిపారు. వరద నష్టం అంచనాపై శనివారం ఉదయం ప్రాథమిక నివేదిక పంపుతామని చెప్పారు. బాధితులకు సాయంపై కేంద్రంతో మాట్లాడుతున్నామని.. ఏరియల్‌ సర్వే ద్వారా ముంపు ప్రాంతాలన్నీ పరిశీలించానని చంద్రబాబు చెప్పారు.

ప్రస్తుతం తమ లక్ష్యం అంతా బుడమేరు గండ్లు పూడ్చడమేనని తెలిపారు చంద్రబాబు. ప్రస్తుతానికి ఎగువ ప్రాంతం నుంచి నీరు రావడం లేదు. ముంపు ప్రాంతాల్లో కూడా క్రమంగా నీరు తగ్గుతోంది. అందుకే ఇప్పుడే వీలయినంత తొందరగా గండ్లు పూడ్చాలని చూస్తున్నామని ఆయన అన్నారు. ఇప్పటికి రెండు గండ్లు పూడ్చారు. మూడోది పూడ్చడానికి ఆర్మీ కూడా వచ్చింది. ఇవాళ రాత్రికి ఆపని కూడా అయిపోతుందని తెలిపారు. దాంతో పాటూ వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు కూడా యుద్ధప్రాతిపదికన చేపట్టామని బాబు చెప్పారు. 3.12 లక్షల ఆహార పొట్లాలు, 11.5 లక్షల వాటర్‌ బాటిళ్లు, పాలు, బిస్కెట్లు, కొవ్వొత్తులు పంపిణీ చేశాం. నీరు నిల్వ ఉన్న చోట తప్ప మిగతా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించాం. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చాం. వరద ప్రాంతాల్లో 72శాతం పారిశుద్ధ్య పనులు పూర్తి చేశాం. 7,100 మంది పారిశుద్ధ్య సిబ్బంది పనిచేస్తున్నారు. 1,300 పీడీఎస్‌ వాహనాలు తిరుగుతున్నాయి. మూడు రోజులు మొత్తం అన్నీ ప్రభుత్వమే చూసుకుంటుందని చెప్పారు. మరోవైపు బాధితుల కోసం ఉచిత బస్సులను కూడా ఏర్పాటు చేశామని సీఎం చంద్రబాబు చెప్పారు.

Also Read: Mahesh Kumar Goud: అవకాశాలు రాకున్నా నిరాశ చెందలే.. స్టూడెంట్ లీడర్ నుంచి పీసీసీ చీఫ్‌ వరకు.. మహేశ్ ప్రస్థానం ఇదే!

Advertisment
Advertisment
తాజా కథనాలు