Minister Lokesh: ఇది జగన్ మేడ్ డిజాస్టర్.. లోకేష్ ఫైర్
AP: బురద రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్గా జగన్ మారారని మంత్రి లోకేష్ అన్నారు. సొంత డబ్బుతో కనీసం పులిహోర ప్యాకెట్ అందజేసిన చరిత్ర ఆయనకు లేదని ఫైర్ అయ్యారు. బుడమేరు పొంగడానికి ప్రధాన కారణం జగన్.. ఇది జగన్ మేడ్ డిజాస్టర్ అని ధ్వజమెత్తారు.
Andhra Pradesh: కేంద్రం సాయం ఇంకా అందలేదు–చంద్రబాబు
కేంద్రం నుంచి సహాయం వచ్చిందన్న మాట అవాస్తవమని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. తాము ఇంకా కేంద్రానికి రిపోర్ట్ పంపలేదని తెలిపారు.ప్రస్తుతం బుడమేరు గండ్లును పూడ్చడమే తమ లక్ష్యమని...అదే పనిలో ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
Floods in Telugu States: వరదల ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ ఆర్థిక సాయం
భారీ వర్షాల వల్ల వరదలతో కుదేలైన తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం భారీ సాయం ప్రకటించింది. తక్షణ సాయంగా తెలంగాణ, ఏపీకి కలిపి రూ.3,300 కోట్లు విడుదల చేసింది. కేంద్రమంత్రి శివరాజ్ చింగ్ చౌహాన్ తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించిన సంగతి తెలిసిందే.
Floods: వరద బాధితులకు నేటి నుంచి నిత్యావసరాల కిట్లు పంపిణీ
AP: ఈరోజు నుంచి వరద బాధితులకు నిత్యావసరాల కిట్లు పంపిణీ చేయనుంది చంద్రబాబు సర్కార్. 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, లీటరు నూనెతో వ్ వంటి నిత్యావసర వస్తువులకు 2లక్షల కుటుంబాలకు అందించనుంది. రేషన్ కార్డులు లేని వారికి ఆధార్ లేదా బయోమెట్రిక్ ఆధారంగా పంపిణీ చేయనుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/lokesh-jagan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/Chandrababu-1-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-10-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FLOODS-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/vyjayanthi.jpg)