Annaram Barrage Leakage: ప్రమాదంలో అన్నారం బ్యారేజ్‌.. నీళ్లు లీక్!

అన్నారం బ్యారేజ్ ప్రమాదంలో ఉంది. బ్యారేజ్ నుండి మరోసారి నీళ్లు లీక్ అవుతున్నాయి. గతంలో బుంగలు పడడంతో అధికారులు మరమత్తులు చేయగా.. మరోసారి నీళ్లు లీక్ అవుతున్నాయి. ప్రస్తుతం బ్యారేజిలో 10 గేట్లు ఎత్తి 7వేల క్యూసెక్కుల నీళ్ళు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.

Annaram Barrage Leakage: ప్రమాదంలో అన్నారం బ్యారేజ్‌.. నీళ్లు లీక్!
New Update

Annaram Barrage Leakage: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్నారం బ్యారేజ్ ప్రమాదంలో ఉంది. బ్యారేజ్ నుండి మరోసారి నీళ్లు లీక్ అవుతున్నాయి. గతంలో బుంగలు పడడంతో అధికారులు మరమత్తులు చేశారు. అయినా కూడా నీళ్లు మరోసారి లీక్ అవుతున్నాయి. బ్యారేజ్ లో ప్రస్తుతం 2.5టీఎంసీల నీళ్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. నీళ్ళు లీక్ అవుతుండడంతో బ్యారేజ్ ను ఖాళీ చేసే పనిలో పడ్డారు అధికారులు. మొత్తం 10 గేట్లు ఎత్తి 7వేల క్యూసెక్కుల నీళ్ళు దిగువకు విడుదల చేస్తున్నారు. అన్నారం బ్యారేజ్ కి మరో వారంలో నేషనల్ డ్యాం సేఫ్టీ బృందం పరిశీలించనుంది. అన్నారం, సుందిల్ల బ్యారేజ్ ల భవితవ్యం తేల్చనున్న డ్యాం సేఫ్టీ అధికారులు.

ALSO READ: కాంగ్రెస్‌లోకి ఈటల రాజేందర్.. ముఖ్యనేతలతో భేటీ!

DO WATCH:

#cm-revanth-reddy #medigadda-barrage #annaram-barrage-leakage #kaleshwaram-corruption
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe