Uttam Kumar Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సంచలన విషయాలు బయటపెట్టిన మంత్రి ఉత్తమ్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మించిన స్థలం సరికాదని మంత్రి ఉత్తమ్ అన్నారు. డిజైన్, నిర్మాణ లోపాలు, పర్యవేక్షణ లోపం వల్లే మేడిగడ్డ కొంగినట్లు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ సాధ్యం కాదని తేల్చి చెప్పారు. సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు కూడా ప్రమాదంలో ఉన్నాయని అన్నారు.