ICC World Cup Final: మరికొద్దిసేపట్లో ఫైనల్స్.. భారీగా స్టేడియంకు చేకుకుంటున్న అభిమానులు..

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు భారత్‌-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్‌ కప్‌ ఫైనల్ మ్యాట్‌ జరగనుంది. మ్యాచ్‌ను వీక్షించేందుకు ఇప్పటికే భారీగా అభిమానులు స్టేడియంకు చేరుకుంటున్నారు. దీంతో స్టేడియం వద్ద రద్దీ వాతావరణం నెలకొంది.

New Update
ICC World Cup Final: మరికొద్దిసేపట్లో ఫైనల్స్.. భారీగా స్టేడియంకు చేకుకుంటున్న అభిమానులు..

మరికొద్దిసేపట్లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. దేశవ్యాప్తంగా ఈరోజు ఫైనల్‌ మ్యాచ్‌పైనే చర్చలు నడుస్తున్నాయి. టీవీలు, ఫోన్లకు అతుక్కుపోయేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు. ఇవాళ ఉండే అన్ని పనులను ఆపేసుకొని మరీ మ్యాచ్‌ను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు ఫైనల్‌ మ్యా్చ్‌ జరగనుంది. అయితే ఇప్పటికే స్డేడియంకు భారీగా అభిమానులు తరలిస్తున్నారు. స్టేడియం వద్ద రద్దీ అంతకంతకు పెరిగిపోతూనే ఉంది. ఏకంగా లక్షా 30 వేల మంది వీక్షకులు స్టేడియంలోకి రానున్నారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Also Read: వరల్డ్‌ కప్ ఫైనల్‌ మ్యాచ్‌.. వీక్షకుల కోసం ప్రత్యేకంగా భారీ స్క్రీన్లు ఏర్పాటు..

మరోవైపు ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్‌ మార్లేస్, కేంద్ర హోం మంత్రి అమతి షా, అస్సాం, తమిళనాడు సీఎంలు, తదితరులు కూడా ఈ మెగా ఫైనల్‌కు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్‌ పోలీస్‌ శాఖ భారీ భద్రత ఏర్పాట్లు చేసింది. దాదాపు 6వేలకు పైగా భద్రతా సిబ్బందిని మోహరించింది. చివరగా 2011లో వరల్డ్‌ కప్‌ను గెలుచుతున్న టీమ్‌ఇండియా.. ఈసారి కూడా కప్‌ను దక్కించుకునేందుకు గట్టి పట్టుదలతో ఉంది. అయితే ఎవరు గెలుస్తారో తెలియాలంటే ఈరోజు రాత్రి వరకు వేచి చూడాల్సిందే.

#cricket-news #icc-world-cup-2023 #icc-world-cup-india-vs-australia #national-news #telugu-news
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు