Para Olympics 2024: పారిస్‌లో జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో వరంగల్‌కు చెందిన అథ్లెట్ దీప్తి జీవన్జీ కాంస్యం దక్కించుకున్నారు. 400 మీటర్ల టీ20 ఫైల్స్‌లో ఆమె ఈ పతకాన్ని గెలుచుకున్నారు. కేవలం 55.82 సెకెన్లలో దీప్తి 400 మీటర్ల పరుగును పూర్తి చేశారు. ఉక్రెయిన్ అమ్మాయి యులియా షులియార్ 55.16 సెకన్లతో స్వర్ణం సాధించింది. ఆండర్ ఐజెల్ (తుర్కియే) 55.23 సెకన్లతో రజతం గెలిచింది. ఒక దశలో రెండో స్థానంలో ఉన్న దీప్తి ఆఖర్లో కాస్త వెనుకబడింది. ఈ క్రీడల ముందు వరకు 400 మీ. టీ-20 విభాగంలో ప్రపంచ రికార్డు దీప్తిదే. 55.07 సెకన్లతో గత ఏడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో ఆమె నెలకొల్పిన రికార్డును ప్రస్తుత క్రీడల్లో హీట్స్‌లో ఐజెల్ 54.96 సెకన్లతో బద్దలు కొట్టింది. ఫైనల్లో ఆమె రజతం సాధించింది.
పూర్తిగా చదవండి..Paris: పారా ఒలింపిక్స్‌లో వరంగల్ అమ్మాయికి కాంస్యం
పారిస్‌లో జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో వరంగల్‌కు చెందిన అథ్లెట్ దీప్తి జీవన్జీ కాంస్యం దక్కించుకున్నారు. 400 మీటర్ల టీ20 ఫైల్స్‌లో ఆమె ఈ పతకాన్ని గెలుచుకున్నారు. కేవలం 55.82 సెకెన్లలో దీప్తి 400 మీటర్ల పరుగును పూర్తి చేశారు.
Translate this News: