Telangana Elections: ఒకవైపు అకాల వర్షాలు.. మరోవైపు ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ నాయకులు ప్రచారాల్లో కురిపిస్తున్న హామీల వర్షంతో తెలంగాణ ప్రజలు తడిసి ముద్దవుతున్నారు. ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్(Congress), బీసీ అభ్యర్థే సీఎం అని బీజేపీ(BJP), 60 ఏండ్లలో చెయ్యని అభివృద్ధి పదేండ్లలో చేసి చూపించాం అని బీఆర్ఎస్(BRS).. ఇలా అన్నీ పార్టీల నాయకులు తెలంగాణ ప్రజలకు హామీలు ఇస్తూ తమ ప్రచారంలో జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నారు.
ALSO READ: బీజేపీకి షాక్.. కాంగ్రెస్ లోకి కీలక నేత
తాజాగా ఏపీలోనే కాదు.. మా బలం, బలగం తెలంగాణలో కూడా ఉందని చెప్పేందుకు బీజేపీతో పెట్టుకొని తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దిగుతున్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అధినేతగా ఉన్న జనసేన (Janasena) పార్టీకి ఎన్నికల ముందే షాక్ కొట్టిందనే చెప్పాలి. ఇప్పటికే ఎనిమిది మంది అభ్యర్థులను ప్రకటించి ప్రచారాల్లో ఇతర పార్టీలతో సరిసమానంగా దూసుకుపోతుంది జనసేన. ఇదిలా ఉంటె వరంగల్ లో జనసేన పార్టీ ఎదురుదెబ్బ తగిలింది. వరంగల్ జనసేన తూర్పు ఇన్‌చార్జి తాళ్లపెల్లి బాలుగౌడ్ (Balu Goud) ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ ఆశించిన ఆయన.. టికెట్ రాకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి ఇవాళ (శనివారం) మంత్రి కేటీఆర్ (KTR) సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు వరంగల్ 42వ డివిజన్ స్వతంత్ర కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్, ఉద్యమ నాయకుడు అచ్చ విద్యాసాగర్‌తో పాటు మరికొందరు బీఆర్‌ఎస్‌లో చేరారు. కేటీఆర్ వారికి కండువా కప్పి గులాబీ సైన్యంలోకి ఆహ్వానించారు.
ALSO READ: కన్నీరుమున్నీరైన మందకృష్ణ మాదిగ.. హత్తుకుని ఓదార్చిన ప్రధాని మోదీ..
ఇది చూశారా?