ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం జరిగే అవకాశముంది. ఇరు దేశాల మధ్య ఘర్షణకు అగ్రరాజ్యం అమెరికా మరింత ఆజ్యం పోస్తోంది. ఇజ్రాయెల్‌కు అమెరికా నుంచి మరిన్న ఫైటర్ జెట్స్ వస్తున్నాయి. మిడిల్ ఈస్ట్‌కు అదనపు యుద్ధనౌకలు చేరాయి. ఇరాన్ టార్గెట్‌గా ఇజ్రాయెల్ భారీగా మిసైల్స్ ఎక్కుపెట్టింది. ఇటీవల ఇరాన్ రాజధాని టెహ్రన్‌లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యకు గురైన సంగతి తెలిసిందే. దీంతో హనియా హత్యపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read: ఇరాన్ లో బహిరంగంగా పాట పాడినందుకు మహిళ అరెస్ట్..
తమ భూభాగంలో హనియాని హత్య చేసిన ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్ ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలోనే వ్యూహాత్మకంగా దాడి చేసేందుకు ప్లాన్ చేస్తోంది. మరోవైపు ఇప్పటికే ఇజ్రాయెల్, హిజ్బొల్లా మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం జరుగుతోంది. లెబనాన్‌లోని బీరూట్‌లో ఇజ్రాయెల్ చేసిన దాడిలో హిజ్బొల్లా సీనియర్ కమాండర్ మృతి చేశారు. దీంతో ప్రతీకారంగా హిజ్బొల్లా ఇజ్రాయెల్‌పై దాడులకు పాల్పడుతోంది.