Chiranjeevi : వాల్తేరు వీరయ్య 365 డేస్ ..మెగా రికార్డ్

మెగాస్టార్ చిరంజీవి - రవితేజ కాంబోలో బాబీ డైరెక్షన్ లో వచ్చినవాల్తేరు వీరయ్య అవనిగడ్డ రామకృష్ణ థియేటర్ లో 365 రోజుల సక్సస్ ఫుల్ రన్ పూర్తిచేసుకున్న సందర్బంగా ఈ చిత్ర యూనిట్ కు కృతజ్ఞతలు తెలుపుతూ చిరంజీవి వాయిస్ నోట్ రిలీజ్ చేశారు.

Chiranjeevi : వాల్తేరు వీరయ్య 365 డేస్ ..మెగా రికార్డ్
New Update

Waltair Veerayya @365 : మెగాస్టార్(Mega Star) చిరంజీవి(CHIRANJEEVI) వింటేజ్ లుక్ తో ఊర మాస్ అప్పియరెన్స్ తో అదరగొట్టిన మూవీ వాల్తేరు వీరయ్య(Waltair Veerayya). 2023 సంక్రాంతి(Sankranti) కనౌకగా రిలీజయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ రిలీజయి ఏడాది పూర్తిచేసుకున్నా ఇంకా ఆ మ్యానియా నుంచి ఫ్యాన్స్ బయటపడలేదు. గతేడాది అత్యధిక వసూళ్లు 236 కోట్లు రాబట్టిన ఈ మూవీ ఓ థియేటర్ లో ఇప్పుడు 365 రోజులు రన్ ని సక్సస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న సందర్బంగా మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ(Avanigadda) ప్రాంతం రామకృష్ణ థియేటర్ లో వాల్తేరు వీరయ్య 365 రోజుల రన్ తో సంచలన రికార్డు సొంతం చేసుకోగా ఈ రికార్డుపై చిరంజీవి వాయిస్ నోట్ రిలీజ్ చేశారు.

మెగా వాయిస్

అభిమానులందరికి హ్యాపీ న్యూ ఇయర్ . 2023 సంక్రాంతి నుంచి 2024 సంక్రాంతి వరకు ఒక సoవంత్సరం పాటు అవనిగడ్డ రామకృష్ణ థియేటర్లో వాల్తేరు వీరయ్య చిత్రం ఆడుతుందంటే మీకు నామీద ఉన్న ప్రేమ అభిమానం ఎలాంటివో తెలుస్తున్నాయి. థ్యాంక్యూ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫక్షన్ . ఈ రోజుల్లో ఇది ఎవరూ టచ్ చేయలేని రికార్డ్ . ఈ రికార్డుకు కారణం మీకు నచ్చేలా.. మీరు మెచ్చేలా ఈ చిత్రాన్ని మలిచిన డైరెక్టర్ బాబీ(BOBY), అలాగే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్(DEVISRE PRASAD) , నా తమ్ముడు(RAVI TEJA) రవితేజ తోపాటు ఈ చిత్రం లో ఉన్న ఇతర తారాగణం. వీళ్లందరినీ దండలా ఏర్చి కూర్చిపేర్చిన (MYTRI) మైత్రి సంస్థ . అందరి సమిష్టి కృషి వాల్తేరు వీరయ్య . ఇలాంటి మరిన్ని చిత్రాల్ని మీకందించేందుకు ప్రతిక్షణం ప్రయత్నిస్తూనే ఉంటాను. లవ్ యు ఆల్. మీకందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ మెగాస్టార్ వాల్తేరు వీరయ్య చిత్ర యూనిట్ కు, ఈ చిత్రాన్ని అంతలా అభిమానించిన ప్రేక్షకులకు , 365 రోజులు ప్రదర్శించిన థియేటర్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపిన ఈ వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

MEGA STAR FOR A REASON ❤️❤️

𝐁𝐎𝐒𝐒 𝐎𝐅 𝐌𝐀𝐒𝐒𝐄𝐒 𝐌𝐄𝐆𝐀 𝐒𝐓𝐀𝐑 @KChiruTweets garu sends his heartfelt thanks note & NewYear/sankranthi wishes to all his fans & telugu audience Via this Voice Note for wholesome love & admiration upon him and especially for making MEGA… pic.twitter.com/gmn9yjSH4N

— SivaCherry (@sivacherry9) January 10, 2024

365 డేస్ ఈవెంట్

లాస్ట్ ఇయర్ వాల్తేరు వీరయ్య 200 రోజులు ప్రదర్శించిన సందర్బంగా 200 డేస్ ఈవెంట్ ఈ చిత్ర యూనిట్ హైదరాబాద్లో జరిపిన సంగతి తెలిసిందే.ఆ వేడుకలో చిరు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ .. అత్యధిక రోజులు సినిమా ప్రదర్శితమై, విజయానికి గుర్తుగా షీల్డు అందుకున్నందుకు ఒళ్లు పులకరిస్తోందని . చరిత్ర మళ్లీ పునరావృతమవుతోందని ఆనాటి రోజులను చిరు మళ్లీ గుర్తుచేసుకోవడం తెలిసిందే. అదే సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇప్పుడు ఈ వాయిస్ వీడియో రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు  వాల్తేరు వీరయ్య 365 రోజుల వేడుక అఖిల చిరంజీవి యువత ఆధ్వర్యంలో( AVANIGADDA RAMAKRISHANA) అవనిగడ్డ రామకృష్ణ థియేటర్లో ఈ మెగా సంబరాలను నిర్వహించారు.

మల్టీ స్టారర్ జానర్ కు కొత్త ఊపు

ఈ రోజుల్లో ఒక సినిమా వారం రోజులు ప్రదర్శించడమే చాలా కష్టం. అలాంటిది ఏకంగా 365 రోజులు సినిమా నడవటం అంటే మామూలు విషయం కాదు. వింటేజ్ చిరుని అత్యద్భుతంగా మలచినతీరుకి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మెగాస్టార్ సరసన శృతిహాసన్ నటించగా .. రవితేజ పాత్ర చిత్రణ మల్టీ స్టారర్ జానర్ కు కొత్త ఊపునిచ్చిందనే చెప్పాలి. ఇక.. ఈ సంక్రాంతికి మెగా స్టార్ నుంచి ఎలాంటి సినిమాలేకపోయినా వాల్తేరు వీరయ్య 365 రోజుల వేడుకే అసలైన 2024 సంక్రాంతి కానుక అంటూ మెగాభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక.. మెగాస్టార్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే .. ప్రస్తుతం ( VASHISTA ) వశిష్ఠ డైరెక్షన్లో విశ్వంభర చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో చందమామ కథలా రూపొందిస్తున్నట్లు సమాచారం.

ALSO READ : హరి హర వీరమల్లు దర్శకుడు అందుబాటులో లేడా? కీరవాణి కామెంట్స్ వైరల్

#sruthihasan #mytri-movie-makers #waltair-veerayya #raviteja #chiranjeevi #director-boby
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి