Vladimir Putin : ఐదోసారి.. రష్యా అధ్యక్షుడిగా పుతిన్.. స్టాలిన్ రికార్డు బ్రేక్!

రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమీర్ పుతిన్ మరోసారి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే 25ఏళ్ల పాటు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన పుతిన్.. స్టాలిన్​ తర్వాత అత్యధిక కాలం రష్యా ప్రెసిడెంట్ గా పనిచేసిన వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేశారు. పుతిన్ 2030వరకూ పదవీలో ఉండనున్నారు.

Vladimir Putin : ఐదోసారి.. రష్యా అధ్యక్షుడిగా పుతిన్.. స్టాలిన్ రికార్డు బ్రేక్!
New Update

Russia : వ్లాదిమిర్ పుతిన్ ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. మంగళవారం దేశ రాజధాని మాస్కో(Mascow) లోని గ్రాండ్ క్రెమ్లిన్ ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో పుతిన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే 25ఏళ్ల పాటు రష్యా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన పుతిన్.. మరో 6ఏళ్లు అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. ఇక రష్యాలో స్టాలిన్​ తర్వాత అత్యధిక కాలం రష్యా అధ్యక్షుడిగా పనిచేసిన అధ్యక్షుడిగా పుతిన్ రికార్డు క్రియేట్ చేయగా.. పుతిన్ 2030వరకూ పదవీలో ఉండనున్నారు.

రష్యా మరింత బలపడుతుంది..
ఈ మేరకు ప్రమాణ స్వీకారం సందర్భంగా మాట్లాడిన పుతిన్(Putin).. రాబోయే రోజుల్లో రష్యా మరింత బలపడుతుందని అన్నారు. శత్రువులుగా భావించే దేశాలతోనూ సంబంధాలను బలోపేతం చేస్తామన్నారు. పాశ్చాత్య దేశాలతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని, రష్యాలో అభివృద్ధిని ఆపడానికి పాశ్చాత్య దేశాలు నిరంతరం ప్రయత్నిస్తున్నాయని విమర్శలు చేశారు. అంతేకాదు తమపై దాడి చేయడానికి ఉక్రెయిన్‌(Ukraine) కు ఆయుధాలు సరఫరా చేస్తున్నాయని ఆరోపించారు.

ఇది కూడా చదవండి: PM Modi: మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు.. వారిదే కపట ప్రేమ: మోడీ కీలక వ్యాఖ్యలు!

పాశ్చాత్య దేశాల బహిష్కరణ..
ఇక రష్యా రాజ్యాంగం ప్రకారం మరో ఆరేళ్ల పాటు పోటీ చేయడానికి పుతిన్ కు అర్హత ఉంది. పుతిన్ పరిపాలనలో రష్యాను ఆర్థిక పతనం నుంచి ప్రపంచ భద్రతకు ముప్పు కలిగించే దేశంగా మార్చడం విశేషం. కాగా మార్చిలో జరిగిన రష్యా సార్వత్రిక ఎన్నికల్లో పుతిన్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పుతిన్‌కు దాదాపు 88శాతం ఓట్లు వచ్చాయి. అతని ప్రత్యర్థి నికోలాయ్ ఖరిటోనోవ్‌కు కేవలం 4శాతం ఓట్లు మాత్రమే సాధించగలిగారు. 2000లో పుతిన్ తొలిసారిగా అధ్యక్షుడవగా.. ఆ తర్వాత 2004, 2012, 2018లో కూడా ప్రెసిడెంట్‌గా ఎన్నికై బాధ్యతలు చేపట్టారు. మాస్కోలోని అన్ని విదేశీ దౌత్య కార్యాలయాల అధిపతులను పుతిన్ ప్రారంభోత్సవానికి హాజరుకావాలని ఆహ్వానించారు. అయితే పుతిన్ ప్రమాణ స్వీకారాన్ని బ్రిటన్ తో పాటు పాశ్చాత్య దేశాలు బహిష్కరించాయి. కొన్ని దేశాలు తమ రాయబారులను పంపించాయి. కానీ ఉక్రెయిన్‌పై దండయాత్ర చేసిన కారణంగా వారంతా బహిష్కరించినట్లు పలు నివేదికలు వెల్లడించాయి.

#ukraine #russia #vladimir-putin #mascow
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe