Andhra Pradesh:యూట్యూబ్‌లో దుమ్ముదులుపుతున్న వివేకం మూవీ..ఎన్నికలపై ప్రభావం చూపించనుందా?

ఆంధ్రప్రదైశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా తీసిని వివేకం సినిమా యూట్యూబ్‌లో దుమ్ముదులుపుతోంది. విడుదల అయిన ఒక్క రోజులోనే 10 లక్షల వ్యూస్ వచ్చాయి. ఎన్నికల ముందు ఈ సినిమాకు ఇంతలా ఆదరణ రావడంతో వైసీపీకి గుండెల్లో రాయిపడ్డట్టు అయితే...టీడీపీ మాత్రం సంబరాలు చేసుకుంటోంది.

New Update
Andhra Pradesh:యూట్యూబ్‌లో దుమ్ముదులుపుతున్న వివేకం మూవీ..ఎన్నికలపై ప్రభావం చూపించనుందా?

Vivekam Movie In You tube: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో వరుసపెట్టి పొలిటికల్ సినిమాలు విడుదల అయ్యాయి. ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ రెండూ ఒకరికొ వ్యతిరేకంగా ఒకరు మూవీస్ తీసి...విడుదల చేశారు. అన్నీ రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలే. ఇందులో వైసీపీకి అనుకూలంగా యాత్ర 2 ఒకటి. మరో రెండు రాంగోపాలవర్మ తీసిన వ్యూహం, శపథం అని చెప్పవచ్చును. ఇందులో వ్యూహం సినిమా రావగోపాలవర్మ తీశారు. ఇవన్నీ ఎన్నికల కోడ్ కన్నా ముందే రిలీజ్ అయ్యాయి. అలాగే వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ కూడా వివేకం అనే సినిమాను రిలీజ్ చేసింది. ఇది థియేటర్లలో రిలీజ్ అయింది. కానీ ఓటీటీల్లో రిలీజ్ కాకుండా వైసీపీ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ నుంచి నోటీసులు తీసుకుంది. దాంతో ఈ మూవీని టీడీపీ యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది.

వివేకా బయోపిక్..

ముఖ్యమంత్రి జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి బయోపిక్‌గా తెరకెక్కిన వివేకం సినిమా విడుదల అయిన ఒక్కరోజులోనే 10 లక్షల వ్యూస్ అభించాయి. దీనిని యూట్యూబ్‌లో జనాలు తెగ చూసేస్తున్నారు. అప్పట్లో వివేకాను హత్య చేశారు. అది ఎవరు చేశారో ఇప్పటి వరకు తేలకపోయినా...హత్య మాత్రం పెను సంచలనం సృష్టించింది. దీన్నే ప్లాట్‌గా తీసుకుని...జగన్‌కు వ్యతిరేకంగా మూవీ తీశారు. ఇందులో జగనే తన బాబాయ్‌ని హత్య చేసినట్లు చూపించారని తెలుస్తోందది. సీబీఐ ఛార్జ్ షీట్ ఆధారంగా టీమ్ ఎస్ క్యూబ్ ఈ మూవీని తీసింది. వివేకా హత్య జరిగిన తర్వాత అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మీడియాలో మాట్లాడిన మాటలను కూడా యథాతథంగా పెట్టేశారు. జగన్ పాత్రతో ఆ డైలాగ్‌లు యాజ్‌టీజ్‌గా చెప్పిస్తూనే...పక్కన ఆ వీడియోను కూడా చూపించారు.

వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా...

ఈ సినిమా మొత్తం ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగానే చూపించారు. అధికారం కోసమే జగన్ వివేకాను హత్య చేసినట్లు నిరూపించే ప్రయత్నం చేశారు. వివేకా మీద గొడ్డలి వేటు వేయడానికి కుట్ర ఎక్కడ మొదలైంది...ఎవరెవరు అమలు చేశారు...ఎవరెవరు వెనుక ఉన్నారు లాంటి విషయాలు సినిమాలో చూపించారు. హూ కిల్డ్ బాబాయ్ అంటూ బాగా ప్రాచుర్యం పొందిన డైలాగ్‌తో మొదలుపెట్టి మొత్తం వివేకా హత్యకు దారి తీసిన అన్ని పరిణామాలను చూపించే ప్రయత్నం చేశారు. రాజశేఖర్‌రెడ్డిని దేవుడిగా చెబుతూ ఆయన కడుపున పుట్టిన జగన్‌ను రాక్షసుడిగా చూపించే ప్రయత్నమే వివేకం. వైఎస్ జగన్ భార్య భారతికి మేనమామ కొడుకు అయిన కడప ఎంపీ అవినాష్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం జరిగిన యుద్ధమే వివేకా హత్య కేసు అన్నట్టు చూపించారు.

ఇప్పుడు ఎన్నికల ముందు ఈ సినిమా యూట్యూబ్‌లో విడుదల అవడంతో దీనికి భారీగా వ్యూస్ వస్తుననాయి. ఇది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద ఎక్కువగానే ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ సినిమా యూట్యూబ్‌లో రిలీజ్ టీడీపీకి ప్లస్ పాయింట్ అయితే...వైసీపీకి మైనస్‌గా మారే అవకాశం కూడా ఉంది.

Also Read:PM Modi: కచ్చతీవు ద్వీపం మీద ప్రధాని మోదీ విమర్శలు..కాంగ్రెస్‌ను నమ్మలేనని వ్యాఖ్యలు

Advertisment
Advertisment
తాజా కథనాలు