Lifetime Pani Puri: రండి.. రండి.. పానీ పూరీ తింటే రూ.21 వేల ప్రైజ్మనీ.. ఎగబడుతున్న కస్టమర్స్!
మహారాష్ట్రలోని నాగపూర్లో ఓ పానీపూరీ షాప్ యజమాని వినూత్న ఆఫర్స్ ప్రకటించాడు. రూ.99వేలు చెల్లిస్తే జీవిత కాలం పానీపూరీ తినొచ్చన్నాడు. ఇంకా ఒకేసారి 151 తింటే రూ.21వేల నగదు బహుమతి పొందొచ్చన్నాడు. ఒకేసారి 40 తినగలిగితే రూ.1 మాత్రమే చెల్లించాలి అని తెలిపాడు.