Renu Desai: ‘నేను చచ్చిపోతా.. నా బిడ్డలను కాపాడండి'.. HCU వివాదంపై పవన్ మాజీ భార్య సంచలన వీడియో

నటి రేణు దేశాయ్ HCU ఉద్యమానికి మద్దతు పలికారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేస్తూ ఒక వీడియో పంచుకున్నారు. ‘‘నేను రేపోమాపో చనిపోతాను. నా బిడ్డలతో పాటు ఎంతోమంది బిడ్డలకు చాలా ఫ్యూచర్ ఉంది. ఈ అంశంపై మరొక్కసారి ఆలోచించండి’’ అని ఆ వీడియోలో తెలిపారు.

New Update
Renu Desai Save HCU

Renu Desai Save HCU

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఒక సెన్సిటివ్ అంశంపై పెద్ద ఎత్తున రచ్చ నడుస్తుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న అడవిని, జంతువులను, అరుదైన మొక్కలను తొలగించడంపై తీవ్ర స్థాయిలో ఉద్యమం కొనసాగుతోంది. HCU భూముల పరిరక్షణ కోసం విద్యార్థులతో పాటు ప్రజలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు మద్దతు తెలుపుతున్నారు. 

Also Read: ఈ సారి ట్రంప్‌ కొరడా ఆరోగ్య శాఖ పై..వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు!

ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు ఈ అంశంపై గళం విప్పారు. తాజాగా దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశయ్ కూడా స్పందించారు. HCU విద్యార్థుల ఉద్యమానికి మద్దతు పలికారు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కొన్ని విజ్ఞప్తులు చేశారు. 

Also Read: ఏప్రిల్‌లో ఫోన్ల జాతర.. బ్రాండెడ్ మోడల్స్ వచ్చేస్తున్నాయ్-ఫుల్ డీటెయిల్స్ ఇవే!

రేణు సంచలన వీడియో

‘‘నమస్కారం.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారూ ఒక పబ్లిక్‌గా హృదయపూర్వక విజ్ఞప్తి. నాకు రెండు రోజుల క్రితం HCU అంశం గురించి తెలిసింది. కొన్ని విషయాల గురించి కూడా కనుక్కున్నాను. అందువల్లనే ఈ వీడియో చేస్తున్నాను. ఒక తల్లిగా మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. నా వయస్సు 44 ఏళ్లు. నేను రేపో మాపో చనిపోతాను. కానీ నా బిడ్డలతో పాటు చాలా మంది బిడ్డలకు చాలా ఫ్యూచర్ ఉంది. 

Also Read: యూట్యూబర్ రణ్‌వీర్‌ అల్హాబాదియాకు షాక్.. సుప్రీం కోర్టు కీలక ప్రకటన

వాళ్లందరికీ ఆక్సీజన్, వాటర్ చాలా అవసరం. డెవలప్‌మెంట్ చాలా అవసమే. అందులో డౌట్ ఏమీ లేదు. కానీ ఎక్కడైనా.. ఒక్క పాజిబిలిటీ ఉన్నా.. ఈ ఒక్క 400 ఎకరాలను వదిలేయండి. దీనికోసం నేను మీకు బెగ్గింగ్ చేస్తున్నాను. ఏదో ఒకటి ట్రై చేయండి సర్. మన రాష్ట్రంలో ఇంకా ఖాళీగా ఉన్న చాలా ప్రదేశాలు ఉన్నాయి. వాటిని తీసుకుని డెవలప్ చేయండి సర్. 

Also Read: కొడాలి నానిని కాపాడేందుకు రంగంలోకి డాక్టర్ పాండా.. ఆయన ట్రాక్ రికార్డ్ తెలిస్తే షాక్ అవుతారు!

మీరు చాలా సీనియర్ నాయకులు, మీరు ఎన్నో విషయాల్లో చాలా ఎక్స్‌పట్స్. ప్లీజ్ ఇంకొక్కసారి ఆలోచించండి. మనకు ఆక్సీజన్, వాటర్ ఎంతో అవసరం సర్.. ప్లీజ్ ఆ 400 ఎకరాలను వదిలేయండి. హార్ట్ ఫుల్‌గా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. మరొక్కసారి ఆలోచించండి.. మిగతా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను.’’ అని రాసుకొచ్చారు. 

(actress-renu-desai | latest-telugu-news | telugu-news | hcu lands | hcu campus land issue)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు