/rtv/media/media_files/2025/03/16/eAqNfQzUek8KjICpDQKP.jpg)
two lions walking towards biker
Viral Video: అబ్బా.. జెర్రుంటే సచ్చిపోతుండేరా.. ఈ వీడియోలు ఉన్న వ్యక్తులు కరెక్టుగా ఇదే అనుకున్నారు కావచ్చు. అటవీ ప్రాంతం సమీపంలోని మార్గంలో ఇద్దరు వ్యక్తులు బైక్ పై వెళ్తున్నారు. అయితే అదే దారిలో రెండు సింహాలు వారికి ఎదురుగా రావడం చూసి దూరంగా ఆగిపోయారు. ఒక వ్యక్తి మాత్రం భయంతో వెంటనే బైక్ నుంచి దిగి పారిపోయాడు. మరోవ్యక్తి కొంతదూరం నుంచి సింహాలను చూస్తూ బైక్ పైనే కూర్చున్నాడు. ఇంతలో అక్కడ ఓ వ్యక్తి ఉన్నాడని గమనించిన రెండు సింహాలు మెల్లిగా అతడి వైపుగా వెళ్లడం స్టార్ట్ చేశాయి. దీంతో అతడు పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లి దాక్కున్నాడు. అదృష్టవశాత్తు సింహాలు వెంటాడకపోవడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన గుజరాత్‌లోని గిర్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది.
Also Read: AR Rahman: నోరు తెరిస్తే ఏమౌతుందో తెలిసిందా.. యూట్యూబర్ అల్లాబాడియాకు రెహ్మాన్ చురకలు!
Another day in Gujurat😃
— Susanta Nanda (@susantananda3) March 16, 2025
The lion pair is just not interested in human as its prey. Otherwise, it could have easily outpaced the running bikers. pic.twitter.com/Rogc1ydJGx
Also Read: అమెరికా నుంచి అక్రమ వలసదారులు ఔట్.. అమృత్‌సర్‌లో ల్యాండ్ అయిన విమానం
ఈ వీడియో (Viral Video) క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన కొందరు నెటిజన్లు వాళ్ళ అదృష్టం బాగుంది అంటూ ఫన్నీగా కామెంట్ చేయగా.. మరికొందరు షాకయ్యారు. దీనిని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా ఎక్స్ లో షేర్ చేశారు. ''మనిషిని ఆహారంగా తీసుకునేందుకు సింహాల ఆసక్తి చూపలేదు. లేదంటే వారిని వేటాడి ఉండేవి'' అని పేర్కొన్నారు.
Also Read: Boney Kapoor: ఇంట్లో అలా చేస్తే తప్పేంకాదు.. అలహాబాదియా వివాదంపై శ్రీదేవి భర్త షాకింగ్ కామెంట్స్!