/rtv/media/media_files/2025/02/07/lKvKhKA9cHOSJQ0u2Al7.jpg)
buffalo birth to calf
Viral Video: ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రతిరోజూ వింత విత విషయాలు వైరల్ అవుతూనే ఉంటాయి. వీటిలో కొన్ని సంఘటనలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన వారంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు.
Also Read: Thandel : తండేల్ ఓటీటీ రిలీజ్ అందులోనే..? ఎంత ధరకు అమ్ముడుపోయాయంటే!
దూడకు జన్మనిచ్చిన బర్రె..
ఈ వైరల్ వీడియోలో ఓ కుటుంబానికి చెందిన గేదె ఒక దూడకు జన్మనిచ్చినట్లుగా ఉంది. దీన్ని నమ్మడం కష్టం.. కానీ ఆ కుటుంబానికి చెందిన వారే ఈ విషయాన్ని చెబుతున్నారు. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం.. ఇదొక ప్రకృతి సృష్టించిన అద్భుతంగా పరిగణించబడుతుంది. ఈ వీడియోలో గేదె జన్మనిచ్చిన దూడ గోధుమ రంగులో ఉంది. అయితే ఆ గేదె యజమాని కూడా దీన్ని చూసి ఆశ్చర్యపోయారట. ఈ వార్త గ్రామం అంతటా వ్యాపించడంతో.. దూడను చూడడానికి భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే ఎద్దు వీర్యాన్ని ఇంజెక్ట్ చేయడం ద్వారా ఇలా జరిగిందని గ్రామస్థులు నమ్ముతున్నారు. కానీ వైద్యుల అభిప్రాయం ప్రకారం గేదె శరీరం ఎద్దు వీర్యాన్ని స్వీకరించదు. కావున ఈ వాదన తప్పని చెబుతున్నారు. దూడ ఆవులా కనిపించినప్పటికీ, దాని లక్షణాలు పూర్తిగా గేదెలా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఏదేమైనా ఈ వీడియో ప్రస్తుతం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.