Shanmukha OTT: ఓటీటీలోకి సడెన్‌ ఎంట్రీ ఇచ్చిన ఆది సాయికుమార్ 'షణ్ముఖ'.. ఎక్కడ చూడొచ్చంటే..?

ఆది సాయికుమార్, అవికా గోర్ ముఖ్య పాత్రల్లో నటించిన డివోషనల్ థ్రిల్లర్‌ ‘షణ్ముఖ’ను ప్రముఖ తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ఆహా లో ఏప్రిల్ 11 నుండి స్ట్రీమింగ్ చేయనున్నారు.

New Update
Shanmukha OTT

Shanmukha OTT

Shanmukha OTT: ఆది సాయికుమార్, అవికా గోర్ ముఖ్య పాత్రల్లో నటించిన డివోషనల్ థ్రిల్లర్‌ ‘షణ్ముఖ’  సినిమా త్వరలో డిజిటల్ స్క్రీన్‌పై ప్రేక్షకులను పలకరించబోతోంది. షణ్ముగం సప్పని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవల థియేటర్లలో విడుదలై అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఓటీటీ వేదికపై రెండో సారి తన లక్ పరీక్షించుకోబోతోంది ‘షణ్ముఖ’.

Also Read: టాప్ సీక్రెట్ బయటపెట్టిన మిల్కీబ్యూటీ..

ఏప్రిల్ 11 నుండి స్ట్రీమింగ్

ఈ సినిమాను ప్రముఖ తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ఆహా లో ఏప్రిల్ 11 నుండి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, “మరచిపోయిన కథలు... దాచిన నిధులు... పాత రహస్యాలు వెలుగులోకి రానున్నాయి” అనే ట్యాగ్‌లైన్‌తో ఆహా ఒక ఆసక్తికర ప్రమోషనల్ పోస్టర్‌ను విడుదల చేసింది.

Also Read: “SSMB29” రిలీజ్ డేట్ పై హాట్ బజ్! ఆ సెంటిమెంట్‌ కలిసొస్తుందా?

ఇప్పటికే థియేటర్లలో ఈ సినిమా మిక్స్డ్ టాక్ దొంతం చేసుకుంది. ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. డివోషనల్ థ్రిల్లర్ జానర్‌లో ఆసక్తికర కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని  ఇంట్లో నుండే ఈ వీకెండ్ కి చూసి ఎంజాయ్ చేయండి. 

Also Read: డ్రాగన్ వచ్చేది అప్పుడే..! రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న NTR 31..

Also Read: Allu Ajun-Atlee: కాపీరైట్ వివాదం..అల్లు అర్జున్, అట్లీ మూవీకి బిగ్ షాక్

Advertisment
Advertisment
తాజా కథనాలు