Viral Video: మహిళ చెవిలో దూరిన పాము.. ఒళ్ళు గగుర్పొడిచే వీడియో!

ఓ మహిళ చెవిలోకి పాము దూరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి చిమటాతో పామును బయటకు తెస్తుంటే అది ఇంకా లోపలికి జారుతుంది. ఇది నిజమా, ఫేక్ వీడియో అన్నదానిపై స్పష్టత లేకపోయినా వీడియో మాత్రం ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది.

New Update
Snake In Woman Ear

Snake In Woman Ear

Viral Video: ఈరోజుల్లో సోషల్ మీడియాలో రోజుకో కొత్త వీడియో వైరల్ అవుతోంది. వాటిలో కొన్ని ఫన్నీ గా ఉంటే, మరి కొన్ని ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. తాజాగా అలాంటిదే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, అది చూస్తే గూస్ బంప్స్ రావడం పక్కా, ఈ వీడియో చూసిన వారంతా ఫుల్ షాకైపోతున్నారు.

Also Read: 11, 12, 14 ఈ నెంబర్లకు ఆపరేషన్ సిందూర్‌కు ఉన్న లింక్ ఏంటో తెలుసా..?

మహిళ చెవిలో పాము..

అసలేం జరిగిందంటే, ఓ మహిళ చెవిలో పాము(Snake In Woman Ear) దూరింది. మీరు విన్నది నిజమే.. ఈ దృశ్యాలను చూసినవారు భయంతో వణికిపోయారు. పామును బయటకు తీయడానికి ఓ వ్యక్తి చిమటాను ఉపయోగించి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆ పాము చెవి లోపలికి జారుతూనే ఉంది. ఆ మహిళ నొప్పితో కేకలు వేస్తూ స్థానిక భాషలో ఏదో మాట్లాడుతుంటే, అక్కడున్నవారంతా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు.

Also Read: Operation Sindoor : పాక్‌పై దాడుల వేళ...నేడు CCS తో ప్రధాని మోదీ కీలక భేటీ

ఈ వీడియోను ఇంస్టాగ్రామ్ లో 'therealtarzann' అనే యూజర్ పోస్ట్ చేశాడు. వీడియో ఫుల్ వైరల్ కావడంతో నెటిజన్లు దీనిపై కామెంట్లు చేస్తున్నారు. కొంత మంది ఈ వీడియో ఫేక్ అంటూ కామెంట్లు చేస్తుండగా మరి కొందరు ఇది స్క్రిప్టెడ్ వీడియో అని అంటున్నారు. ఓ యూజర్ "ఇది ఫేక్ పాములా కనిపిస్తోంది" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈ వీడియో ఫుల్ వైరల్ గా మారింది.

Also Read: యావత్ దేశానికే గర్వకారణం.. ఆపరేషన్ సిందూర్ పై మోదీ ఫస్ట్ రియాక్షన్!

అయితే, ఈ వీడియో ఏ ప్రాంతం నుండి రికార్డ్ అయిందో క్లారిటీ లేదు. ఇందులో నిజం ఎంతో కూడా ఖచ్చితంగా చెప్పలేం. అయినప్పటికీ, వీడియోలో చూపిన దృశ్యాలు మాత్రం ఒళ్ళు గగుర్పొడిచేలా అందరిని  దడిపిస్తున్నాయి.

Also Read:భారత్ దాడి చేసిన 9 ప్రాంతాలివే.. లష్కరే తోయిబా కంచుకోట ఖతం!

Advertisment
తాజా కథనాలు