/rtv/media/media_files/2025/05/10/cnNyFp2xC4X9bTuGwxkM.jpg)
army jawan going to border after 3 days of marriage wife emotional video
India- Pak War: బార్డర్ లో భారత సైన్యం ఉన్నారనే ధైర్యంతో దేశ ప్రజలంతా హాయిగా నిద్రపోతున్నారు. కానీ జవాన్ల కుటుంబాలు మాత్రం గుండెలు గుప్పిట్లో పెట్టుకొని ఉన్నారు. తమ ప్రియమైన వారి గురించి.. ఏ సమయంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని క్షణ క్షణం భయపడుతున్నారు.
పెళ్ళైన మూడు రోజులకే
అలాంటిది పెళ్ళైన మూడు రోజులకే భార్యను వదిలి బార్డర్ కి బయలు దేరారు ఓ జవాన్. దీంతో భార్య, అతడి కుటుంబ సభ్యులు కన్నీటితో అతడిని సాగనంపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా కూడా ఎమోషనల్ అవుతున్నారు. ఆ జవాన్ కుటుంబానికి దైర్యం చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.
పెళ్లయిన మూడు రోజులకే బోర్డర్‌కు తిరిగి రావాలని జవాన్‌కు పిలుపు
— RTV (@RTVnewsnetwork) May 10, 2025
మహారాష్ట్రకు చెందిన జవాన్ మనోజ్ పాటిల్‌కు ఈనెల 5న వివాహం జరిగింది
వివాహ సెలవుల మీద ఉన్న జవాన్ మనోజ్ పాటిల్‌కు.. భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా బోర్డర్‌కు తిరిగి రావాలని పిలుపొచ్చింది
మనోజ్ భార్య… pic.twitter.com/AwYy5x8HY8
మహారాష్ట్రకు చెందిన మనోజ్ పాటిల్ అనే జవాన్ వివాహ సెలవుల కోసమని ఇంటికి వచ్చాడు. మే 5న మనోజ్ పెళ్లి జరిగింది. ఇంతలోనే భారత్- పాక్ మధ్య యుద్ధం మొదలవడంతో.. వెంటనే రావాలంటూ జవాన్ మనోజ్ కి ఆర్మీ నుంచి పిలుపు వచ్చింది. దీంతో పెళ్ళైన మూడు రోజులకే భార్యను వదిలి బార్డర్ కి బయలు దేరాడు జవాన్ మనోజ్. భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో మనోజ్ భార్య, కుటుంబ సభ్యులు భయాందోళన చెందుతున్నారు. ఎంతో ఆవేదనతో మనోజ్ ని బార్డర్ కి సాగనంపారు. ''నా సింధూరాన్ని దేశ రక్షణ కోసం పంపుతున్నాను'' అంటూ భార్య యామినీ మనోజ్ ని పంపించింది.
అయితే ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక పర్యాటకులు మృతి చెందారు. ఈ దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని తేలడంతో భారత్ ప్రతీకార చర్యగా ఆపరేషన్ సిందూర్ చేపట్టి... పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరలపై వైమానిక దాడులు నిర్వహించింది. దాదాపు 90 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. జాష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల్లో కీలక పాత్రలు పోషించిన ఐదుగురు ఉగ్రవాదులను భారత బలగాలు అంతం చేశాయి. దీని తరువాత ఇండియన్ ఆర్మీ, ప్రభుత్వ ఉద్యోగులు , అధికారుల సెలవులను కేంద్రం రద్దుచేసింది. సెలవులపై ఇంటికి వెళ్లిన వారిని వెనక్కి రప్పి్ంచాలని ఆదేశాలు జారీ చేసింది.
india pak war | latest-news | telugu-news | Viral Video | army-jawan