Man Mums: హగ్ కి రూ. 600.. చైనాలో 'మ్యాన్ మమ్స్' ట్రెండ్!

చైనాలో 'మ్యాన్ మమ్స్' అనే కొత్త ట్రెండ్ మొదలైంది. ఇందులో యువతులు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి హగ్గులను కొనుగోలు చేస్తారు. ఐదు నిమిషాల హగ్ కి రూ. 600 చెల్లిస్తారట. అబ్బాయిలను వారి ప్రవర్తన, ఓర్పు, శరీర ఆకృతి, రూపాన్ని బట్టి ఎంపిక చేసుకుంటారు.

New Update
man mums china trend

man mums china trend

Man Mums:  చైనాలో మరో కొత్త ట్రెండ్ మొదలైంది. యువతులు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి, ఎమోషనల్ టైమ్స్ లో ఓదార్పు కోసం హగ్గులను కొనుగోలు చేస్తున్నారు. ఐదు నిమిషాల హగ్ కి 600 అట! హగ్ కి 600 ఏంట్రా బాబు అని అనుకుంటున్నారా? అవునండి.. ఇదే చైనాలో మొదలైన కొత్త ట్రెండ్ 'మ్యాన్ మమ్స్'!

Also Read :  డియర్ EC.. ఎలక్షన్ కమిషన్‌కు రాహుల్ గాంధీ 2 డిమాండ్లు

 "మ్యాన్ మమ్స్"?

సాధారణంగా "మ్యాన్ మమ్స్" అంటే కండలు తిరిగిన పురుషులు అని అర్థం. కానీ.. ఇప్పుడు ఈ పదం శారీరక బలాన్ని, సున్నితత్వం, ఓర్పు వంటి లక్షణాలను కలిగి ఉన్న పురుషులను సూచిస్తుంది. ఈ పురుషులు ఆప్యాయంగా, ఓదార్పునిచ్చే కౌగిలింతలను అందిస్తారు.

Also Read :  అరాచకం.. 11,000mAh బ్యాటరీ, 108MP కెమెరాతో కొత్త ఫోన్.. పిచ్చెక్కిపోవాల్సిందే భయ్యా!

ఎందుకు ఈ ట్రెండ్?

అయితే ప్రస్తుత ఆధునిక జీవితంలో పని ఒత్తిడి, చదువుల భారం, వ్యక్తిగత సమస్యల వల్ల యువతులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. చాలా మంది యువతులు తమ సమస్యలను ఎవరితో పంచుకోవాలో తెలియక, ఇలాంటి కౌగిలింతల ద్వారా ఉపశమనం పొందుతున్నారని చెబుతున్నారు.  

ఒక విద్యార్థిని తన థీసిస్ ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఒక "మ్యాన్ మమ్" నుంచి కౌగిలి కావాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ట్రెండ్ బాగా వైరల్ అయ్యింది.  ఈ పోస్ట్ కు  లక్షకు పైగా కామెంట్లు వచ్చాయి. 

Also Read :  ఆమెతో పిల్లల్ని కనాలని ఉంది! బాలీవుడ్ ర్యాపర్ నోటి దూల! తిట్టిపోస్తున్న నెటిజన్లు

ఈ హగ్స్ ఎలా జరుగుతాయి ?

అయితే ఈ కౌగిలింతలు సాధారణంగా చాట్ యాప్‌ల ద్వారా ఏర్పాటు చేయబడతాయి. సాధారణంగా మాల్స్, సబ్‌వే స్టేషన్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో జరుగుతాయి. ఇందులో యువతులు అబ్బాయిలను  వారి ప్రవర్తన, ఓర్పు, శరీర ఆకృతి, రూపాన్ని బట్టి ఎంపిక చేసుకుంటారు. కొన్నిసార్లు కౌగిలింతకు ముందు ప్రైవేట్‌గా చాట్ కూడా చేస్తారట.
ఐదు నిమిషాల కౌగిలికి 20 నంచి 50 యువాన్లు (అంటే రూ. 250 నుంచి రూ. 600) చెల్లిస్తారు.

ఈ  'మ్యాన్ మమ్' ట్రెండ్ పై రకరకాల అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.  కొంతమంది దీని ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని నమ్ముతుంటే, మరికొందరు దీనిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొందరు న్యాయవాదులు ఇలాంటి సేవలు లైంగిక వేధింపులకు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు. ఏదేమైనప్పటికీ  , చైనాలో ఈ ట్రెండ్ విస్తరిస్తోంది.

ఈ ట్రెండ్  గురించి ఓ మహిళా ఇలా చెప్పింది..  మూడు గంటల ఓవర్ టైం పని తర్వాత ఒక "మ్యాన్ మమ్"ని కలుసుకుని తన బాస్ గురించి వాపోయిందట. అప్పుడు అతను ఆమె భుజంపై ప్రేమగా తట్టి ఓదార్చినట్లు తెలిపింది. 

Also Read: Shambhala Teaser: ఆ అంతుచిక్కని రహస్యం ఏంటి?.. ఫుల్ మిస్టరీ గా 'శంభాలా' టీజర్

 

viral-news | man mums China trend

Advertisment
Advertisment
తాజా కథనాలు