Madhya Pradesh : విద్యార్థులకు మద్యం తాగించాడు.. టీచర్‌ పై సస్పెన్షన్‌ వేటు!

మధ్యప్రదేశ్‌లోని కఠ్‌నీ జిల్లాలో పాఠశాల విద్యార్థులకు మద్యం తాగించాడు టీచర్ లాల్ నవీన్‌ ప్రతాప్‌ సింగ్‌. ఈ ఘటనను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు కొందరు వ్యక్తులు. దీంతో ప్రతాప్‌ సింగ్‌ను సస్పెండ్ చేశారు జిల్లా కలెక్టర్‌.

New Update
madhya-pradesh teacher

madhya-pradesh teacher

విద్యార్థులకు చదువు చెప్పి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన  ఓ టీచర్ బాధ్యత మరిచాడు. తాను  తప్పు చేయడమే కాకుండా విద్యార్థుల చేత కూడా తప్పు చేయించాడు. మధ్యప్రదేశ్‌లోని కఠ్‌నీ జిల్లాలో పాఠశాల విద్యార్థులకు మద్యం తాగించాడు  లాల్ నవీన్‌ ప్రతాప్‌ సింగ్‌ అనే ఓ టీచర్. ఈ ఘటనకు సంబంధించిన  వీడియో తీసి సోషల్ మీడియాలో  పోస్టు చేశారు కొందరు వ్యక్తులు. దీంతో ప్రతాప్‌ సింగ్‌ను సస్పెండ్ చేశారు జిల్లా కలెక్టర్‌ దిలీప్‌ కుమార్‌ యాదవ్‌. 

Also read :  వేడినీళ్లతో బాత్రూమ్‌కు వెళ్తుండగా కోతుల బీభత్సం.. వృద్ధురాలు మృతి

పాఠాలు  బోధించడానికి బదులుగా

నవీన్ ప్రతాప్ సింగ్ బాఘేల్ అనే ఉపాధ్యాయుడు ఖిర్హానీలోని ఒక ప్రాథమిక పాఠశాలలో పరిచేస్తున్నాడు. అతను నిత్యం మద్యం తాగి పాఠశాలకు వస్తాడు. విద్యార్థులకు పాఠాలు  బోధించడానికి బదులుగా వారికి మద్యం తాగడం ఎలానో నేర్పిస్తున్నాడు.  నవీన్ ప్రతాప్ సింగ్ ఇటీవల విద్యార్థులకు మద్యం అందిస్తున్న వీడియోను ఎవరో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో వైరల్ కావడంతో, జిల్లా కలెక్టర్ డాక్టర్ దిలీప్ యాదవ్ ఆ ఉపాధ్యాయుడిని తక్షణమే సస్పెండ్ చేశారు.   దుష్ప్రవర్తన, పిల్లలను మద్యం తాగమని ప్రోత్సహించడం, ఉపాధ్యాయుడి గౌరవాన్ని దెబ్బతీసినందుకు మధ్యప్రదేశ్ సివిల్ సర్వీసెస్ (ప్రవర్తన) నిబంధనల ప్రకారం సింగ్‌ను వెంటనే సస్పెండ్ చేసినట్లు అధికారి తెలిపారు.

Also read : వ్యభిచార ముఠా గుట్టు రట్టు..  హైదరాబాద్‌కు వచ్చిన అమాయక యువతులతో..!

Advertisment
తాజా కథనాలు