/rtv/media/media_files/2025/04/19/lQfNJaUoHPZcYUoQRIHL.jpg)
Prostitution gang
సికింద్రాబాద్ పరిధిలోని రాంగోపాల్‌పేట పరిధిలో వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఉద్యోగాల కోసం హైదరాబాద్ కు వచ్చిన అమాయక యువతులతో బాపుబాగ్ కాలనీలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తుంది ముఠా. పోలీసులకు పక్కా సమాచారం అందడంతో శనివారం దాడులు చేశారు.
స్వప్న అనే మహిళ మోసగించి
యువతులను స్వప్న అనే మహిళ మోసగించి వ్యభిచారంలోకి దింపుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ముఠాలోని మహమ్మద్ అవియాస్, హుస్సేన్‌లను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న లడ్డు, స్వప్న కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇద్దరు యువతులను వ్యభిచార గృహం నుంచి పోలీసులు రక్షించారు.