/rtv/media/media_files/2025/04/19/IbCfqPRnLnKKgXBdl3uF.jpg)
monkeys attack on old women cause to death
Monkeys Attack పాపం స్నానానికి వెళ్తున్న వృద్ధురాలు.. కోతులు దాడి చేయడంతో ప్రాణాలు విడిచింది. ఈ విషాదకర ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పెరికవేడులో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గురువారం రాత్రి మల్లమ్మ అనే వృద్ధురాలు వేడి నీళ్ల బకెట్ తీసుకొని స్నానానికి వెళ్తుంది. ఇంతలో కోతుల గుంపు దాడి చేయడంతో వేడి నీళ్లు ఆమె పై పడి తీవ్ర గాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు తొర్రూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతి చెందింది. మల్లమ్మకు భర్త మాకయ్య తో పాటు ఆడుగులు కూతుళ్లు, కొడుకు రాజు ఉన్నారు. ఈ విషాద ఘటన కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది.
కరీంనగర్ లో మరో వృద్ధురాలిపై
ఇదిలా ఉంటే ఇటీవలే కరీంనగర్ జిల్లా మంకమ్మ తోటలో మరో వృద్ధురాలిపై కోతులు భీభత్సం సృష్టించాయి. వెంటాడి మరీ ఆమెపై దాడి చేశాయి. దీంతో అక్కడి స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అదృష్టవశాత్తు ఎదురింటి వాళ్ళు చూడడంతో... బామ్మను కోతుల దాడి నుంచి కాపాడారు. లేదంటే బామ్మ ప్రాణాలకే ప్రమాదం కలిగేది అంతా భయపడ్డారు. అయితే ముందుగా ఓ కోతి బామ్మ కొంగు పట్టుకొని లాగడంతో ఆమె కింద పడిపోయింది. దీంతో వెంటనే పదుల సంఖ్యల్లో కోతులు అక్కడికి చేరుకొని ఆమెను చుట్టుముట్టాయి. ఇంతలో పక్కింటి వాళ్ళు చూడడంతో వృద్ధురాలిని కాపాడగలిగారు. మరోవైపు సైదాపూర్ మండలంలో కోతులు రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకోవడం గ్రామస్థులను వణికించింది. దీంతో గ్రామ ప్రజలు కోతుల సమస్యను పరిష్కరించాలని అధికారులను వేడుకుంటున్నారు.
latest-news | telugu telugu-news | warangal
Also Read: Upendra 45 Movie: కన్నడ ఇండస్ట్రీ నుండి మరో సెన్సేషన్ – సనాతన ధర్మం కాన్సెప్ట్ తో ఉపేంద్ర ‘45’..